లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘మాస్టర్’. సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసే సినిమాల్లో విజయ్ ‘మాస్టర్’ సినిమా కూడా ఒకటని చెప్పొచు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు. కరోనా లేకపోతే ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అయి ఉండేది. కరోనా వల్ల థియేటర్స్ మూత పడటంతో సినిమా రిలీజ్ కూడా ఆగిపోయింది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగించుకున్న ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా నుండి చాలా కాలంగా ఒక్క అప్ డేట్ కూడా రాలేదు. ఇక ఇప్పుడు విజయ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది చిత్రయూనిట్. ఈ సినిమా నుండి టీజర్ రెలీజ్ కు డేట్ అండ్ టైం ను ఫిక్స్ చేశారు. దీపావళి పండుగ సందర్భంగా ఈ సినిమా టీజర్ ను నవంబర్ 14 న సాయంత్రం 6గంటలకు రిలీజ్ చేయనున్నారు.
Thank you all for the patience and support! 🙏 pic.twitter.com/qjcUtxYH0P
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) November 12, 2020
కాగా ఈ సినిమాలో విజయ్ కు జోడీగా మాళవిక మోహనన్ నటిస్తుంది. ఎక్స్బి ఫిల్మ్ క్రియేటర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి విలన్గా నటించనున్నాడు. మలయాళ నటుడు ఆంటొని, శాంతను కీలక పాత్రలు చేస్తున్నారు. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. తమిళంతో పాటు తెలుగులోను కూడా రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో విజయ్ గ్యాంగ్ స్టర్ గా .. కాలేజ్ ప్రొఫెసర్ గా రెండు విభిన్నమైన లుక్స్ తో కనిపించనున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: