కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 20

సినిమా వార్తలు

ప్రణీత రిస్కీ ఫీట్

బ్లాక్ బస్టర్ "పోకిరి "మూవీ కన్నడ రీమేక్ "పొర్కి " సూపర్ హిట్ మూవీ తో ప్రణీత సుభాష్ కెరీర్ ను ప్రారంభించారు. తెలుగు , తమిళ భాషాచిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ బస్టర్ "అత్తారింటికి దారేది " మూవీ తో ప్రణీత ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "రామన అవతార "కన్నడ మూవీ లో నటిస్తున్న ప్రణీత "భుజ్ :ది ప్రైడ్ ఆఫ్ ఇండియా మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. మరో బాలీవుడ్ మూవీ "హంగామా 2 "మూవీ లో కథానాయికగా ప్రణీత ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ప్రయాణానికి సిద్ధం - శృతి హాసన్

స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ "వకీల్ సాబ్ ", రవితేజ "క్రాక్ ", విజయ్ సేతుపతి "లాభం "(తమిళ ) మూవీస్ తో బిజీగా ఉన్నారు. ఇన్ స్టాగ్రామ్ లో 15. 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న శృతి ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ తన జీవిత విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. తన లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ శృతి అభిమానులను అలరిస్తున్నారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

మిడ్ నైట్ చలిలో 'ఆర్ఆర్ఆర్' టీమ్ షూటింగ్

కరోనా వల్ల ఆర్ఆర్ఆర్ షూటింగ్ కి చాలా గ్యాప్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టగా టీం మాత్రం నిర్విరామంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఒక్కసారి కమిట్ అయితే ఎంత కష్టమైనా షూటింగ్ కు మాత్రం బ్రేక్ చెప్పడు. ఇక ఇప్పటికే షూటింగ్ కు సంబంధించి పలు వీడియోలు పోస్ట్ చేయగా ఇప్పుడు మరో వీడియో ను ఆర్ఆర్ఆర్ టీం పోస్ట్ చేసింది. ఇక వీడియోలో చూస్తుంటే చ‌లికి వ‌ణుకుతూ షూటింగ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అప్పుడే పెళ్లి చేసుకుంటా - లేకపోతే సింగిల్ గానే ఉంటా

కొంత మంది హీరోయిన్స్ వ్యక్తిగత జీవితం ఎప్పుడు వార్తల్లోనే ఉంటుంది. వారి పెళ్లి, ప్రేమ విషయాలపై ఎప్పుడూ ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ముఖ్యంగా నయనతార, త్రిష, అనుష్క వీరి పెళ్లిళ్లపై ఏదో ఒక న్యూస్ వినిపిస్తూనే ఉంటుంది. వీరిలో నయన్ అంటే విఘ్నేష్ తో ప్రేమాయణం సాగిస్తుంది కాబట్టి అది వేరు. కానీ త్రిష, అనుష్క మేము సింగిల్ అని చెప్పినా కూడా ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. ఇక తాజాగా తన పెళ్లిపై స్పందించిన త్రిష తనకు ఎలాంటి వాడు కావాలో.. ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందో అన్న విషయాలు స్పష్టం చేసింది.

TFN Adminవాట్సాప్
Krithi Shetty Grabs Big Movie Oppurtunities In Tollywood.
సినిమా వార్తలు

అవకాశాల "ఉప్పెన "లో కృతి శెట్టి

భరత నాట్యం పెర్ఫార్మర్ , థియేటర్ ఆర్టిస్ట్ కృతి శెట్టి "సరిగమ " కన్నడ మూవీ తో కెరీర్ ప్రారంభించారు. పలు తమిళ మూవీస్ లో కథానాయికగా నటించిన కృతి శెట్టి , బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందిన "ఉప్పెన " మూవీ లో కథానాయికగా నటించారు. కరోనా కారణంగా "ఉప్పెన " మూవీ విడుదల వాయిదా పడింది. మొదటి సినిమా రిలీజ్ కాకుండానే కృతి శెట్టి టాలీవుడ్ లో పలు అవకాశాలు అందుకొనడం విశేషం.

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

ఆది సాయికుమార్ ‘జంగిల్’ ఫ‌స్ట్ లుక్ రిలీజ్

హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకొని వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు ఆది సాయికుమార్. ప్రస్తుతం శ్రీ‌నివాస్ నాయుడు న‌డిక‌ట్ల దర్శకత్వంలో 'శ‌శి' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జరుపుకుంటుంది. ల‌వ్‌, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో ఆయ‌న జోడీగా సుర‌భి నటిస్తుండగా.. మ‌రో కీలక పాత్రలో నాయిక పాత్ర‌ను రాశీ సింగ్ కూడా నటిస్తుంది. శ్రీ హ‌నుమాన్ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై ఆర్‌.పి. వ‌ర్మ‌, రామాంజ‌నేయులు, చింత‌ల‌పూడి శ్రీ‌నివాస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అరుణ్ చిలువేరు సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రాఫ‌ర్‌ అమ‌ర్‌నాథ్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మహేష్ బాబు హాలీవుడ్ లుక్

వరస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ మహేష్ బాబు టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. వయస్సు పెరుగుతున్న కొద్దీ మహేష్ బాబు యంగ్ గా , అందంగా మారుతున్నారు. లాక్ డౌన్ సమయంలో కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ , వర్కౌట్స్ తో మహేష్ టైమ్ స్పెండ్ చేశారు. బ్లాక్ బస్టర్ "గీత గోవిందం "మూవీ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో రూపొందనున్న "సర్కారు వారి పాట "మూవీ కి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

టాలీవుడ్ లో మనకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్

ఇప్పుడంటే సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడ ఏ చిన్న విషయం జరిగినా తెలిసిపోతుంది. కానీ ఒకప్పుడు అలా కాదు. ఇక టాలీవుడ్ లో కూడా అదే పరిస్థితి. అయితే ఎంత టెక్నాలజీ పెరిగినా కూడా మనకు తెలియని కొన్ని విషయాలు మాత్రం ఉంటాయి. అలాంటి వాటిలో ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చూద్దాం మనం.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సుధీర్ బాబు-ఇంద్రగంటి.. ముచ్చటగా మూడోసారి

పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో 'శ్రీదేవి సోడా సెంటర్' లో ఒక సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సుధీర్ ఫుల్ మాస్ లుక్ లో కనిపించనున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఇక సినిమాలో తన పాత్ర కోసం సుధీర్ గోదావరి యాస నేర్చుకుంటున్నట్టు తెలుస్తుంది. కాగా 70 ఎమ్ ఎమ్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై స‌క్సెస్ ఫుల్ నిర్మాత‌లు విజయ్ చిల్లా, శశిదేవి‌రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా రెగ్యూల‌ర్ షూటింగ్ ను త్వరలోనే ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

శ్రీవిష్ణు-రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్లో 'గాలి సంపత్'

కెరీర్ మొదటి నుండి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీవిష్ణు. గత ఏడాది వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన బ్రోచేవారెవరురా సినిమా చేసి మంచి టాక్ ను తెచ్చుకోగా.. ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో వచ్చేస్తున్నాడు. నూతన దర్శకుడు హాసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ " రాజ రాజ చోర". ఈ సినిమా ఇప్పటికే కొంత వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అయితే కరోనా వల్ల షూట్ కు బ్రేక్ రాగా ఇప్పుడు మళ్లీ షూట్ ను ప్రారంభించారు. మేఘా ఆకాష్,సునయన హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'లిటిల్ సోల్జర్స్' - బేబీ కావ్య సూపర్ కామెడీ

కావ్య, బాలాదిత్య బాల నటులుగా 1996 లో వచ్చిన ‘లిటిల్ సోల్జర్స్’ చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది కదా. చిన్నపిల్లలు ఇప్పటికీ ఈ సినిమాను ఎంతో ఇష్టపడతారు. ఇక ఈ చిత్రంలో నటించిన బేబీ కావ్యను కూడా ఎవ్వరూ మరిచిపోలేరు. ఈ సినిమాకు కావ్యనే ఒక పిల్లర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అప్పట్లో కావ్యకు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ కేటగిరిలో నేషనల్ అవార్డు కూడా లభించిందంటేనే చెప్పొచ్చు కావ్య ఏ రేంజ్లో నటించిందో. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుండి బేబీ కావ్య చేసిన కామెడీ సీన్ మీకోసం. ఈకింద లింక్ క్లిక్ చేసి.. చూసి ఎంజాయ్ చేయండి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

థమన్ కు మహేష్, బన్నీ బర్త్ డే విషెస్

'అల వైకుంఠపురములో' లాంటి ఆడియో ఆల్బమ్ తో ఈ ఏడాదిని స్టార్ట్ చేసాడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్. వరుస సూపర్ హిట్ ఆల్బమ్స్ తో దూసుకుపోతున్న థమన్ ను 'అల వైకుంఠపురములో' సినిమా మరో మెట్టు ఎక్కించింది. ఈ పాటలు యూ ట్యూబ్ లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాయో.. ఎన్ని రికార్డ్స్ సాధించాయో చూసాం. ఇక ప్రస్తుతం థమన్ ఒకటి కాదు రెండు కాదు డజను సినిమాలతో సూపర్ బిజీ గా వున్నాడు. ఇక ఈ రోజు థమన్ తన పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా తమన్నా కు విషెస్ తెలియజేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Actor Vijay Deverakonda Enjoys Cloud 9 Moment.
సినిమా వార్తలు

హ్యాపీ మూడ్ లో విజయ్ దేవరకొండ

"పెళ్ళిచూపులు ", "అర్జున్ రెడ్డి ", "గీత గోవిందం ", "టాక్సీవాలా " వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి విజయ్ దేవరకొండ ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సెన్సేషనల్ హీరోగా రాణిస్తున్నారు. తమ క్రేజీ హీరో నటించిన మూవీస్ కై ఆసక్తి తో ఎదురు చూసే అభిమాన గణం ఎక్కువే. విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న "ఫైటర్ " మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ తో విజయ్ బాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పూజాహెగ్డే ట్రెడిషినల్ లుక్

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని పూజాహెగ్డే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ పూజాహెగ్డే అభిమానులను అలరిస్తున్నారు. పూజాహెగ్డే "రాధేశ్యామ్ ", "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్" మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. ఆ రెండు మూవీస్ షూటింగ్స్ ముగింపు దశలో ఉన్నాయి. రెండు బాలీవుడ్ మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

మాస్టర్ 'టీజర్' కు సూపర్ రెస్పాన్స్

లోకేష్ కనకరాజ్‌ దర్శకత్వంలో విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా 'మాస్టర్‌'. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు. కరోనా లేకపోతే ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అయి ఉండేది. కరోనా వల్ల థియేటర్స్ మూత పడటంతో సినిమా రిలీజ్ కూడా ఆగిపోయింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

"సీటీమార్" అప్ డేట్

పవన్ కుమార్ సమర్పణ లో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సంపత్ నంది దర్శకత్వంలో యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్, తమన్నా జంటగా కబడ్డీ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా "సీటీ మార్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఆంధ్రా కబడ్డీ టీమ్ కోచ్ గా గోపీచంద్ ,తెలంగాణ కబడ్డీ టీమ్ కొచ్ గా తమన్నా నటిస్తున్నారు. "హిప్పీ " మూవీ ఫేమ్ దిగాంగన , సీనియర్ హీరోయిన్ భూమిక , రెహమాన్ , తరుణ్ అరోరా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

"మహాసముద్రం " మూవీ థీమ్ పోస్టర్ రిలీజ్

ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూపర్ హిట్ "RX 100 "మూవీ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా యాక్షన్ ఎంటర్ టౌనర్ "మహాసముద్రం "మూవీ తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కనున్న విషయం తెలిసిందే. హీరో సిద్ధార్ధ్ ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. 7 సంవత్సరాల తరువాత సిద్ధార్ధ్ టాలీవుడ్ కు రీ ఎంట్రీ కావడం విశేషం. అదితి రావు హైదరీ , అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బాలీవుడ్ లోకి 'ఆకాశం నీ హ‌ద్దురా..!'

బాలీవుడ్ ప్రస్తుతం సౌత్ సినిమాలపై బాగానే ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఈ మధ్య చాలా సౌత్ సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ అయ్యాయి. ఇంకా కొన్ని సినిమాలు లైన్ లో కూడా ఉన్నాయి. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా మరో సినిమాను రీమేక్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ సినిమా ఏదో కాదు 'ఆకాశం నీ హద్దురా'. ఈ సినిమా అలా రిలీజ్ అయిందో లేదో అప్పుడే రీమేక్ కు రెడీ అయిపోయారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'మహానటి' మరో ప్రయోగం

మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ రేంజ్ ఎంత పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పలుభాషల్లో ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది కీర్తి సురేష్. ఇప్పటికే ఈమె నటించిన లేడీ ప్రధాన పాత్రలో వచ్చిన 'పెంగ్విన్', మిస్ ఇండియా సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. అయితే ఆ రెండు సినిమాలు కాస్త నిరాశనే మిగిల్చాయని చెప్పొచ్చు. ప్రస్తుతం మరో రెండు, మూడు మహిళా ప్రధానమైన సినిమాలు లైన్ లో ఉన్నాయి. కీర్తి అమిత్ శర్మ దర్శకత్వంలో 'మైదాన్' సినిమాలో నటిస్తుంది. ఇంకా బాలీవుడ్ డైరెక్టర్ కుకునూర్ దర్శకత్వంలో 'గుడ్ లక్ సఖి' లో నటిస్తుంది. మహేష్ తో 'సర్కారు వారి పాట' అనే సినిమాలో కూడానటిస్తుంది.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

"లవ్ స్టోరీ "స్పెషల్ పోస్టర్

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , అమిగో క్రియెషన్స్ బ్యానర్స్ పై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "లవ్ స్టోరీ "మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. రావు రమేష్ , పోసాని , దేవయాని , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పవన్ సిహెచ్ సంగీతం అందించారు . ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న "లవ్ స్టోరీ " మూవీ ని త్వరలోనే రిలీజ్ చేయడానికి చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్