A1 ఎక్స్ ప్రెస్ – లాస్ట్ డే షూట్

Actress Lavanya Tripathi Wraps Up A1 Express Movie Shoot

డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో సందీప్ కిషన్ A1 ఎక్స్ ప్రెస్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ముందే చాలా వరకూ ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. కరోనా వల్ల ఇన్నిరోజులు షూట్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. అయితే ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ షూటింగ్ లను మొదలు పెట్టారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ సినిమాలో లావణ్య హాకీ ప్లేయర్ గా నటిస్తున్న సంగతి కూడా విదితమే. ఇక ఇన్ని రోజులు షూటింగ్ లో పాల్గొన్న లావణ్య త్రిపాఠి పోర్షన్ ఈ రోజుతో పూర్తి అయినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని తన ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ తెలిపింది. A1 ఎక్స్ ప్రెస్ లాస్ట్ డే షూట్.. ఈ టీంతో పనిచేయడం అమేజింగ్ ఎక్స్పీరియన్స్.. లావణ్య రావు పాత్రలో నటించడం చాలా స్పెషల్ కొంచం స్వీట్.. స్పైస్, నైస్ అంటూ తెలిపింది.

 

View this post on Instagram

 

A post shared by Lavanya T (@itsmelavanya)

కాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందుతుంది. లావణ్య త్రిపాఠి హీరోయిన్ నటిస్తున్న ఈ సినిమాలో మురళీశర్మ, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్నాడు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.