గత ఏడాది `రాక్షసుడు`తో అలరించిన యంగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్… ప్రస్తుతం సాయి శ్రీనివాస్ ‘కందిరీగ’, ‘హైపర్’ చిత్రాల దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో ‘అల్లుడు అదుర్స్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమాలో ఇస్మార్ట్ హీరోయిన్ నభా నటేష్, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోతో జోడీ కడుతున్నారు. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్‌పై జి. సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్న ఈ సినిమాకు… దేవిశ్రీప్రసాద్ సంగీతమందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు సాయి శ్రీనివాస్ తన గాత్ర దానం చేయడానికి రెడీ అయినట్టు తెలుస్తుంది. వికటకవిగా ప్రసిద్ధి పొందిన తెనాలి రామకృష్ణ ఆధారంగా ఓ యానిమేషన్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పేరు “ధీర”.దీనికి క్యాప్షన్ “బుద్ధి రిద్ధి సిద్ధి”. మోషన్ క్యాప్చర్ ఫీచర్ ఫిల్మ్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అరుణ్ కుమార్ రాపోలు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమాకు చెందిన ఫస్ట్ లుక్‌ని ఈ చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. పాన్ ఇండియా లెవల్లో 12 భాషల్లో “ధీర” విడుదల కానుంది. ఇక ఈ సినిమా తెలుగు వర్షన్‌కు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వాయిస్ ఓవర్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. మొదటిసారి వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు. మరి చూద్దాం ఎలా ఉంటుందో.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: