విజయ్ ఆంటోని కొత్త సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్

Actor Vijay Antony New Movie First Look Is Out

విభిన్నమైన సినిమాలు చేయడంలో విజయ్ ఆంటోనీ ఎప్పుడూ ముందుంటాడన్న సంగతి తెలిసిందే. సినిమా జయాపజయాల సంగతి పక్కన పెడితే ప్రతి సినిమాలో ఏదో ఒక విభిన్నత మాత్రం ఉంటుంది. ఇక విజయ్ ఆంటోనీ సినీ కెరీర్ లోనే ‘బిచ్చగాడు’ సినిమా టర్నింగ్ పాయింట్ సినిమా అని చెప్పొచ్చు. తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఈ సినిమా సంచలన విజయం సాధించి పెట్టింది. ‌ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు విజయ్ ఆంటోని. ‘తమిళరసన్‌’, ‘అగ్ని సిరగుగళ్‌’, ‘ఖాకీ’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అంతేకాదు మరోసారి బిచ్చగాడు 2 తో రావడానికి సిద్దమయ్యాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో వస్తున్నాడు. మెట్రో వంటి డిఫరెంట్ సినిమాను తెరకెక్కించిన ఆనంద్ కృష్ణన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తమిళ్ లో ‘కోడియిల్‌ ఒరువన్’ సినిమా రూపొందుతున్న ఈ సినిమాను తెలుగులో ‘విజయ రాఘవన్‌’గా విడుదల చేస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు చిత్రయూనిట్. స్టైల్‌గా కాలుపై కాలు వేసుకుని కూర్చున్న విజయ్‌ ఆంటోని ఫస్ట్‌లుక్ ఆకట్టుకుంటుంది.

 

కాగా ఇన్ఫినిటీ ఫిల్మ్‌ వెంచర్‌ సమర్పణలో చెందూర్ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై టి.డి.రాజా, డి.ఆర్‌.సంజయ్‌ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరువుకుంటుంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × two =