బిగ్ బాస్ 4 – హౌస్ మేట్స్ సీక్రెట్స్

Bigg Boss 4 Housemates Reveal Their Secrets

బిగ్ బాస్ 4 – మొన్న ఎపిసోడ్ లో అఖిల్ సీక్రెట్ రూమ్ లోకి వెళ్లడంతో హౌస్ మేట్స్ అందరూ డల్ అయిపోయారు. ఇక నిన్న ఎపిసోడ్ లో పెద్దగా హైలైట్స్ కూడా ఏం లేవని చెప్పొచ్చు. ఎపిసోడ్ లోకి వస్తే స్టార్టింగ్ స్టార్టింగే అభి, సోహైల్, మెహబూబ్ అఖిల్ గురించి డిస్కషన్. అఖిల్ డిఫెండ్ చేసుకోకుండా ఎలా వెళ్తాడు అని అభి సోహైల్ తో మెహబూబ్ తో అంటూవుంటాడు. దానితో పాటు కెప్టెన్సీ టాస్క్ గురించి కూడా డిస్కస్ చేస్తారు. ఇదంత సీక్రెట్ రూమ్ లో ఉన్న అఖిల్ చూస్తూ కామెంట్స్ చేస్తూ ఉంటాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక మ‌ట‌న్ చెడిపోవ‌డంతో రేష‌న్ మేనేజ‌ర్ అవినాష్ మీద అంద‌రూ నామినేట్ చేస్తామని కామెడీ చేస్తారు. దీంతో ఒక్క కిలో మట‌న్ పంప‌మ‌ని అత‌డు కెమెరాల ముందు వేడుకున్నాడు. అయినా స‌రే శాంతించ‌ని సోహైల్‌, మెహ‌బూబ్‌, అరియానా.. అవినాష్‌ను చిత‌క‌బాదారు. అత‌డిని స్విమ్మింగ్ పూల్‌లో కూడా పడేస్తారు.

ఇక ఆ తర్వాత హౌస్ మేట్స్ కు ఏం టాస్క్ ఇవ్వలేదు కానీ కంటెస్టెంట్లు ఇప్పటివరకూ చెప్పని సీక్రెట్ పంచుకోవాలని చెప్పాడు. అయితే అఖిల్ వారు చెప్పిన దానికి కన్విన్స్ అయితే వాళ్లకి లెటర్ ఇవ్వొచ్చు. లేకపోతే లెటర్లను చింపేయొచ్చు. ఈ ప్రక్రియలో ఒక్కొక్కరూ ఇప్పటివరకూ ఎవరికీ చెప్పని సీక్రెట్ ను పంచుకుంటారు. ముందు మెహబూబ్ తన బెస్ట్ ఫ్రెండ్‌ కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సి వచ్చిందని…రెండు రోజుల వ‌ర‌కు పోలీస్ స్టేష‌న్ నుంచి పంపించ‌లేదు” అని చెప్పుకొచ్చాడు. దీంతో అఖిల్ అత‌డికి లేఖ పంపించాడు

హారిక నాలుగున్న‌రేళ్లు ఓ అబ్బాయితో రిలేష‌న్‌లో ఉన్నాను. ఎక్కువ కేరింగ్ చూపించేస‌రికి అలా జ‌రిగిపోయింది. కానీ ఇప్పుడు బ్రేక‌ప్ అయింది” ఈ సీక్రెట్ మా అమ్మకు ఇంత వరకూ తెలీదే సారి మమ్మీ అని ఏడ్చేసింది. హారికకు కూడా అఖిల్ లెటర్ పంపించాడు.

ఆ తర్వాత అవినాష్ ఓసారి ఆడిష‌న్ కోసం మ‌ణికొండ వెళ్లాను. రూ.80 వేలు ఇస్తే లీడ్ క్యారెక్ట‌ర్ ఇస్తామ‌ని చెప్పారు… ఎలాగోలా డబ్బు తెచ్చి నిర్మాత చేతిలో పెట్టాను… షూటింగ్ వెళ్తున్నాం అని చెప్పి నిర్మాత జంప్ అయ్యారు. మొద‌టిసారి అలా మోసపోయాను. ఇప్ప‌టికీ ఇది మా త‌ల్లిదండ్రుల‌కు తెలీదు” అని చెప్పాడు. అయితే ఈ విష‌యం త‌న‌తో చెప్పాడ‌ని అఖిల్ అత‌డి లేఖను చించేశాడు.

లాస్య నేను పెళ్లాడిన మంజునాథ్ నాక‌న్నా ఒక ఏడాది చిన్న‌. ఈ విష‌యం ఎవ‌రికీ తెలీదు. ఈ షోకు వ‌చ్చాక అమ్మ‌కు షాకుల మీద షాకులిస్తున్నా. వ‌య‌సు చిన్న‌దే అయినా మ‌న‌సు గొప్ప‌ది” అని లాస్య క‌న్నీళ్ల‌తో చెప్పుకొచ్చింది. ఆమెకు లేఖ అంద‌గా దాన్ని చ‌దువుకుంటూ మ‌రోసారి కంట‌త‌డి పెట్టుకుంది.

అభిజిత్.. మొద‌టిసారి అమెరికా వెళ్లిన‌ప్పుడు న్యూయార్క్‌లో ఓ రెస్టారెంటుకు వెళ్లాను. అక్క‌డున్న ఓ వ్య‌క్తి నీకోసం నేను డ్రింక్ తీసుకోవ‌చ్చా అని అడిగాడు. ఇదేదో బాగుందని స‌రే అన్నాను. నెంబ‌ర్ అడిగాడు ఇచ్చాను. ఆ త‌ర్వాత‌ అత‌డు మీద‌మీద‌కొస్తుంటే ఏం చేస్తున్నావు అని అడిగితే ఇది గే బార్ అని చెప్పాడు. అప్పుడు నేను బ‌య‌ట‌కు వెళ్లి బోర్డు చ‌దివాను” అని సీక్రెట్‌ను వెల్ల‌డించాడు. అభికి కూడా లేఖ పంపించాడు అఖిల్.

అరియానా “ఈ జూలై లో నాతో పాటు న‌లుగురు చ‌నిపోయి ఒక సంవ‌త్స‌రం అయ్యేది. మా ఊరుకు వెళ్దాం అని అర్ధ‌రాత్రి కారులో బ‌య‌లుదేరాం.. ఒక మ‌నిషి బైకు మీద అడ్డు వ‌చ్చాడు. ఏం జ‌రిగిందో అర్థం కాలేదు. ఒక కిలోమీట‌ర్ వ‌ర‌కు కారు దూసుకెళ్లి ఎల‌క్ట్రిక్ పోల్‌ను గుద్దింది. కారు నుజ్జ‌య్యింది. బ‌య‌ట‌కు వ‌స్తే వైరులు త‌గిలి షాక్ కొట్టేది. ఆ ప్ర‌మాదం నుంచి బ‌య‌ట ప‌డ‌కుంటే ఈ రోజు నేనిక్క‌డ ఉండేదాన్నే కాదు” అని ఎమోష‌న‌ల్ అయింది. ఇది సీక్రెట్ కాద‌ని అఖిల్ ఆమె లెట‌ర్ చించేశాడు

మోనాల్ “ప‌న్నెండో త‌ర‌గ‌తి పూర్త‌య్యాక‌ నాకు బ్యాంక్‌లో జాబ్ వ‌చ్చింది. ఉద్యోగం చేస్తూనే డిగ్రీ చ‌ద‌వాల‌నుకున్నాను. కానీ కాలేజీ టైమింగ్‌, జాబ్‌ టైమింగ్ సెట్ కాలేదు. దీంతో ఫైన‌లియ‌ర్ డ్రాప్ అవుట్ అయ్యాను. ఎందుకంటే నా ఫ్యామిలీ కోసం చ‌దువు త్యాగం చేశాను. ఇది ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రికీ చెప్ప‌లేదు” అని ఏడ్చేసింది. దీంతో అఖిల్ ఆమెకు లేఖ పంపించాడు.

సోహైల్.. ” కొన్నేళ్ల క్రితం ఓసారి ప‌బ్బు నుంచి తాగొస్తున్నా. అప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే 102 రీడింగ్ వ‌చ్చింది. కారు తీసుకుపోయారు. త‌ర్వాతి రోజు స్టేష‌న్‌కు వెళ్లి చ‌లానా కట్టినా కూడా పేరెంట్స్ ను తీసుకుర‌మ్మ‌న్నారు. డూప్లికేట్ పేరెంట్స్‌ను మాట్లాడిన‌. అది కుదరదని చెప్పడంతో ఆఖ‌రికి మా త‌మ్ముడిని పిలిపించిన‌. ఇది అమ్మావాళ్ల‌కు తెలీదు” అని సీక్రెట్ బ‌య‌ట‌పెట్టాడు. అఖిల్ సోహైల్ కు కూడా లెటర్ పంపించాడు.

ఇక ఫైనల్ గా అఖిల్ కూడా తన లెటర్ ను పంపమని బిగ్ బాస్ ను అడుగుతాడు. ఇక రేపు ఏదో నవ్వించే టాస్క్ ఇచ్చినట్టున్నాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో ఎవరు గెలుస్తారో చూద్దాం మరి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − twelve =