ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 201
స్టాండప్ కమిడియన్ గా..?
నన్ను నమ్మండి.. ఓపికతో ఉండండి

'నేను కేరాఫ్ నువ్వు' ట్రైలర్ రిలీజ్

'మహర్షి' డైరెక్టర్ తోనే తర్వాత సినిమా

'జాను' టీజర్ రిలీజ్
మహేష్ బాబు మనసులో మాట

"స్కైలాబ్" నేపథ్య మూవీ పై సత్యదేవ్ స్పందన
తెలుగు రాష్ట్రాలలో మహేష్ మేనియా

మరో స్టార్ హీరో కు విలన్ గా అరవింద్ స్వామి..?

"సరిలేరు నీకెవ్వరు" మూవీ మేకింగ్ వీడియో రిలీజ్
చిరంజీవి `దొంగ మొగుడు`కి 32 ఏళ్ళు
`బ్రోచేవారెవరురా` భామల `తొలి` సంక్రాంతి సందడి
`పింక్` రీమేక్ షూటింగ్ అప్ డేట్
వరుణ్ తేజ్ కోసం మారుతి స్క్రిప్ట్
దర్బార్ మూవీ పబ్లిక్ ఒపీనియన్
వికారాబాద్ అడవుల్లో రామ్ చరణ్
డైరెక్టర్ నంబర్ వన్ ఎస్.ఎస్. రాజమౌళి రూపొందిస్తున్న మల్టీస్టారర్ `ఆర్ ఆర్ ఆర్`. వాస్తవ పాత్రలు, కల్పిత ఘట్టాలతో రూపొందుతున్న ఈ ఊహాజనిత చారిత్రక చిత్రంలో.. కొమరం భీమ్ గా యంగ్ టైగర్ యన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రస్తుతం మెరుపు వేగంతో చిత్రీకరణ జరుపుకుంటోంది.
చరణ్ నెక్స్ట్ ప్లాన్ - 'సరిలేరు నీకెవ్వరు' డైరెక్టర్ తోనా..?
ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్' లో నటిస్తున్న సంగతి తెలిసిందే. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది. ఇక చెప్పిన డేట్ కే ఈ సినిమా రిలీజ్ అవ్వబోతున్నట్టు కూడా చెప్పా డు రామ్ చరణ్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూ లో.
స్టాండప్ కమిడియన్ గా..?
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ 4వ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో పూజా హెగ్డే రోల్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. పూజా హెగ్డే ఓ స్టాండప్ కమిడియన్ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ పాత్ర కోసం పూజ తెగ కష్టపడిపోతుందట. కొంతమంది స్టాండప్ కమెడియన్స్ ని కలుస్తూ ట్రైనింగ్ తీసుకుంటోందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.
నన్ను నమ్మండి.. ఓపికతో ఉండండి
హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో 'నిశ్శబ్దం' మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు,తమిళ, ఇంగ్లీష్,మలయాళ, హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో 'నిశ్శబ్దం' టైటిల్ తోను, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించింది చిత్రయూనిట్. ఇక ఇటీవలే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్న నటీనటుల పోస్టర్ లు ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు.

'నేను కేరాఫ్ నువ్వు' ట్రైలర్ రిలీజ్
సాగారెడ్డి తుమ్మా దర్శకత్వంలో కిషోర్, సానియా సిన్యా, బాషా నటిస్తున్న చిత్రం ‘నేను కేరాఫ్ నువ్వు’. 1980వ దశాబ్దపు యధార్థ ప్రేమకథ ఆధారంగా తీసిన ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి వుంది.. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

'మహర్షి' డైరెక్టర్ తోనే తర్వాత సినిమా
అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. ఇంకా ఒక్క రోజు మాత్రమే మిగిలివుంది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి. దీనితో ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు చిత్రయూనిట్. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే పలు పాటలు, టీజర్, ట్రయిలర్ రిలీజ్ కాగా వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇంకా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి…

'జాను' టీజర్ రిలీజ్
ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, త్రిష ప్రధాన పాత్రల్లో వచ్చిన ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ '96' సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శర్వానంద్, సమంత జంటగా నటిస్తున్న ఈ రీమేక్ కు కూడా తమిళ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ రీమేక్ షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక మరో పక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ను, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా ఇప్పుడు తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
మహేష్ బాబు మనసులో మాట
సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "సరిలేరు నీకెవ్వరు" మూవీ జనవరి 11 వ తేదీ సంక్రాంతి కానుకగా భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ భారీ ఎత్తున ప్రమోషన్స్ చేపట్టింది . మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హీరో మహేష్ బాబు ఒక ఇంటర్వ్యూ లో తన మనసులో మాటను వెల్లడించారు.

"స్కైలాబ్" నేపథ్య మూవీ పై సత్యదేవ్ స్పందన
నాసా ప్రయోగించిన స్పేస్ స్టేషన్ స్కైలాబ్ ప్రజలలో భయాందోళనలు కలిగించిన విషయం తెలిసిందే. స్కైలాబ్ కూలిపోయి విధ్వసం సృష్టిస్తుందనే వదంతులతో ప్రజలు భయభ్రాంతులయ్యారు . ఇప్పుడు స్కైలాబ్ నేపథ్యంలో ఒక పీరియాడిక్ మూవీ రూపొందనుంది. కె ఎఫ్ సి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో నిత్యా మీనన్ , సత్య దేవ్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో ఈ మూవీ రూపొందనుంది.

దర్బార్ మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే మంచి కమ్ బ్యాక్ తో వచ్చారు రజినీ, మురుగదాస్. ఇన్ని రోజులు ఎదురుచూసిన రజినీ అభిమానులకు మంచి కిక్ ఇచ్చే సినిమా 'దర్బార్' అని చెప్పడం ఎలాంటి సందేహం లేదు.
తెలుగు రాష్ట్రాలలో మహేష్ మేనియా
తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి సినిమా సందడి ప్రారంభం అయింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన "సరిలేరు నీకెవ్వరు " మూవీ 11 వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. తమ అభిమాన హీరో నటించిన "సరిలేరు నీకెవ్వరు " మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కావడం తో మహేష్ బాబు అభిమానుల సందడి కోలాహలం గా ఉంది. చాల కాలం తరువాత మహేష్ బాబు మూవీ సంక్రాంతి పండగ కు రిలీజ్ సందర్భంగా అభిమానుల ఆనందానికి హద్దులు లేవు.

మరో స్టార్ హీరో కు విలన్ గా అరవింద్ స్వామి..?
ఒకప్పుడు స్టార్ హీరోలుగా వెండి తెరపై ఒక ఊపు ఊపిన హీరోలు ఇప్పుడు రీ ఎంట్రీ లో విలన్ పాత్రల్లో తమ సత్తా చూపిస్తున్నారు. జగపతి బాబు, మాధవన్, వివేక్ ఒబెరాయ్ ఇంకా ఈ లిస్ట్ లో అరవింద్ స్వామి కూడా వున్నారు. 90వ దశకంలో రోజా, బొంబాయి లాంటి చిత్రాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం అరవింద్ స్వామి క్యారెక్టర్ రోల్స్, విలన్ రోల్స్ చేస్తున్నాడు. ఇక ధృవ సినిమాతో మంచి స్టైలిష్ విలన్ గా పేరు తెచ్చుకున్నాడు అరవింద్ స్వామి. ఇప్పుడు మరో స్టార్ హీరోకు ఆయన విలన్ గా చేయడానికి రెడీ అయ్యాడు. ఆ హీరో ఎవరో కాదు శింబు.
యన్టీఆర్ `శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం`కి 60 వసంతాలు
ఆంధ్రుల ఆరాధ్య దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి పాత్రలో తెలుగువారి నటదైవం నందమూరి తారక రామారావు జీవించిన చిత్రం `శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం`. అలనాటి అగ్రశ్రేణి దర్శకుడు పి.పుల్లయ్య రూపొందించిన ఈ చిత్రరాజంలో లక్ష్మీ దేవి పాత్రను ఎస్. వరలక్ష్మి ధరించగా, పద్మావతి పాత్రను సావిత్రి పోషించారు. `పద్మశ్రీ వారి` పతాకంపై వి.వేంకటేశ్వర్లు ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ మైథలాజికల్ ఫిల్మ్ లో చిత్తూరు వి. నాగయ్య, శాంత కుమారి, గుమ్మడి, షావుకారు జానకి, రుష్యేంద్రమణి, రాజనాల, రేలంగి, రమణారెడ్డి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

"సరిలేరు నీకెవ్వరు" మూవీ మేకింగ్ వీడియో రిలీజ్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఏ కె ఎంటర్ టైన్ మెంట్స్, జిఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "సరిలేరు నీకెవ్వరు" మూవీ జనవరి 11 వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. విజయశాంతి, సంగీత, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటించారు. మిల్కీ బ్యూటీ తమన్నా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
చిరంజీవి `దొంగ మొగుడు`కి 32 ఏళ్ళు
మెగాస్టార్ చిరంజీవి పలు జనాదరణ నవలాధార చిత్రాల్లో సందడి చేశారు. వాటిలో `దొంగ మొగుడు` ఒకటి. యండమూరి వీరేంద్రనాథ్ పాపులర్ నవల `నల్లంచు తెల్లచీర` ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో రవితేజ, నాగరాజుగా చిరు ద్విపాత్రాభినయం చేయగా.. అతనికి జోడీగా మాధవి, రాధిక, భాను ప్రియ నటించారు. చిరు లక్కీ డైరెక్టర్ ఎ. కోదండరామిరెడ్డి రూపొందించిన ఈ చిత్రాన్ని ఎస్పీ వెంకన్న బాబు నిర్మించారు.
`బ్రోచేవారెవరురా` భామల `తొలి` సంక్రాంతి సందడి
గత ఏడాది ఘనవిజయం సాధించిన పరిమిత బడ్జెట్ చిత్రాల్లో `బ్రోచేవారెవరురా` ఒకటి. శ్రీ విష్ణు కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో నివేదా థామస్, నివేదా పెతురాజ్ నాయికలుగా నటించారు. కట్ చేస్తే.. ఇప్పుడు ఈ ఇద్దరు కూడా సంక్రాంతి బరిలో సందడి చేయనున్నారు. అయితే, ఈ సారి వేర్వేరు సినిమాల్లో.. కీలక పాత్రల్లో దర్శనమివ్వనున్నారు.
`పింక్` రీమేక్ షూటింగ్ అప్ డేట్
హిందీనాట ఘనవిజయం సాధించిన ఎమోషనల్ కోర్ట్ డ్రామా `పింక్` (అమితాబ్ బచ్చన్, తాప్సీ).. తమిళంలోనూ `నేర్ కొండ పార్ వై` (అజిత్, శ్రద్ధా శ్రీనాథ్) పేరుతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. కట్ చేస్తే.. ఇప్పుడీ సినిమా తెలుగులోనూ సరికొత్త వెర్షన్ లో రూపొందుతోంది. `ఎంసీఏ` ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో `దిల్` రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
వరుణ్ తేజ్ కోసం మారుతి స్క్రిప్ట్
మెగా కాంపౌండ్ యంగ్ హీరోలకి కలిసొచ్చిన దర్శకుల్లో మారుతి ఒకరు. ఐదేళ్ళ క్రితం అల్లు శిరీష్‌తో `కొత్త జంట`(2014)ని రూపొందించిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్.. రీసెంట్ గా `సుప్రీమ్` హీరో సాయితేజ్ తో `ప్రతి రోజూ పండగే`ని తెరకెక్కించాడు. `కొత్త జంట` చెప్పుకోదగ్గ విజయాన్ని అందుకోగా.. `ప్రతి రోజూ పండగే` బ్లాక్ బస్టర్ మూవీగా నిలచింది.

సంక్రాంతి పండుగకు ‘మ్యాంగో మ్యూజిక్’ నుండి స్పెషల్ సాంగ్ రిలీజ్
తెలుగు ప్రజలు జరుపుకొనే అతిపెద్ద పండుగ సంక్రాంతి. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజలు ఈ పండుగను ఘనంగా జరుపుకొంటారు. ఇక ఈ పండుగ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. పండుగకు పది రోజుల ముందు నుంచే హడావిడి మొదలవుతుంది. మిగతా రోజులు ఎక్కడున్నా సరే ఈ పండుగ సమయానికి ఇళ్ళల్లో వాలిపోతారు. ప్రతి ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు ,గొబ్బమలతో స్వాగతం పలుకుతాయి. గంగిరెద్దులు, కోడి పందాలు, ఎడ్ల పందాల మాట సరేసరి. ఒక్కమాటలో చెప్పాలంటే మన తెలుగు సంప్రదాయం మొత్తం ఈ పండుగలో ప్రతిబింబిస్తుంది.
దర్బార్ మూవీ పబ్లిక్ ఒపీనియన్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “పబ్లిక్ ఒపీనియన్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది.