చరణ్ నెక్స్ట్ ప్లాన్ – ‘సరిలేరు నీకెవ్వరు’ డైరెక్టర్ తోనా..?

Ram Charan to Work With Anil Ravipudi,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Ram Charan Latest News,Ram Charan New Movie News,Ram Charan Next Film Updates,Ram Charan Next Movie With Anil Ravipudi,Ram Charan Upcoming Movie With Anil Ravipudi

ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది. ఇక చెప్పిన డేట్ కే ఈ సినిమా రిలీజ్ అవ్వబోతున్నట్టు కూడా చెప్పా డు రామ్ చరణ్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూ లో.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఆర్ఆర్ఆర్ తర్వాత చెర్రీ సినిమాపై ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. అనిల్ రావపూడితో తన తర్వాత సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఎఫ్2 సినిమాతో గత సంక్రాంతికి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన అనిల్ రావిపూడి, ఈ సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు అనే సినిమాను రిలీజ్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో కూడా హిట్ కొట్టడం ఖాయమనే టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా గనక సూపర్ సక్సెస్ అయితే చరణ్ అనిల్ రావిపూడితో సినిమా చేయాలని చూస్తున్నాడట. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా తెరకెక్కిన సినిమా సరిలేరు నీకెవ్వరు. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − 6 =