హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో ‘నిశ్శబ్దం’ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు,తమిళ, ఇంగ్లీష్,మలయాళ, హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో ‘నిశ్శబ్దం’ టైటిల్ తోను, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించింది చిత్రయూనిట్. ఇక ఇటీవలే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్న నటీనటుల పోస్టర్ లు ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఈ మధ్య కాస్త ప్రమోషన్స్ లో స్లో అయ్యారు చిత్రయూనిట్. దీనితో ఫ్యాన్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి అప్ డేట్ ఇవ్వమని.. సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నామని సోషల్ మీడియా వేదికగా కోరారు. ఇక ఈ ట్వీట్ కు స్పందించిన కోన.. ఓపికతో ఉండమని… పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు ఉన్నాయని.. అయితే పొంగల్ తర్వాతే అన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయని.. తప్పకుండా సినిమా బిగ్ బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పారు.
Have patience.. We have big Promotional plans .. All announcements after Pongal. NISHABDHAM definitely is going to be a Big Blockbuster!! Trust me. https://t.co/kBbUzxqt8F
— kona venkat (@konavenkat99) January 9, 2020
కాగా ఈ సినిమాలో మాధవన్, అంజలి, షాలిని పాండే, శ్రీనివాస్ అవసరాల, సుబ్బరాజు, మైఖేల్ మ్యాడ్సన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల, కోన వెంకట్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: