మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్, నయనతార ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘దర్బార్’. లైకా ప్రొడక్షన్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్లు, టీజర్ల రిలీజ్ తర్వాత సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాల మధ్య ఈ రోజు ‘దర్బార్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో..? రజినీ కి ఖాతాలో హిట్ పడిందో..? లేదో..? తెలియాలంటే రివ్యూ లోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు: రజినీకాంత్, నయనతార, సునీల్ శెట్టి, నివేదా థామస్
దర్శకత్వం: ఏఆర్ మురుగదాస్
నిర్మాత: ఎన్వీ ప్రసాద్ అండ్ లైకా ప్రొడక్షన్స్
సినిమాటోగ్రఫీ: సంతోష్ శివన్ మ్యూజిక్: అనిరుధ్
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
కథ:
తన కళ్ళముందు తప్పు చేస్తే ఎలాంటి వారైనా సరే ఎదురించి ముందుకెళ్లే పోలీస్ ఆఫీసర్ ఆదిత్య అరుణాచలం (రజినీకాంత్). ఈ నేపథ్యంలో డ్రగ్ మాఫియాని నడిపించే హరి చోప్రా (సునీల్ శెట్టి) ఆదిత్య మీద రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటాడు. డ్రగ్ మాఫియాను తుడిచిపెట్టే క్రమంలో చేసిన ఎన్‌కౌంటర్లపై విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో తన కూతురు వల్లి (నివేదా థామస్) ప్రాణాలను సైతం కోల్పోవాల్సి వస్తుంది. తన కూతురును కోల్పోవడంతో ఆదిత్య అరుణాచలం మరింత అగ్రెసివ్‌గా మారుతాడు. ఈ నేపథ్యంలో ముంబై కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించి డ్రగ్ మాఫియాను అంతం చేయాలనుకున్న ఆదిత్య అరుణాచలంకు ఎదురైన సవాళ్లేంటి? డ్రగ్స్, మానవ అక్రమ రవాణాను అడ్డుకొనేందుకు ఆదిత్య అరుణాచలం ఎలాంటి ఆపరేషన్లు చేపట్టాడు?ఈ విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
రజినీకాంత్ సినిమా అందులో మురుగదాస్ డైరెక్టర్ ఇంకా ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా కాలంగా మంచి హిట్ కోసం చూస్తున్నాడు రజినీ.. గతంలో సర్కార్ చిత్రానికి మురగదాస్ రూపొందించిన సంగతి తెలిసిందే. అయితే ఆ చిత్రం ప్రేక్షకుల అంచనాలు చేరుకోకపోవడంతో దర్బార్ చిత్రాన్ని కసితో తీసాడు. నిజానికి మురగదాస్ తీసుకున్నది ఇంతకుముందు చాలా సినిమాల్లో చూసిందే. డ్రగ్స్, విమెన్ ట్రాఫికింగ్ బ్యాక్ డ్రాప్ తీసుకున్నారు. ఈ కథ చాలా సినిమాల్లో చూసిన సాధారణ రివెంజ్ డ్రామానే. అయితే మురుగదాస్ దీనికి తనదైన శైలి కథనాన్నిజోడించాడు. కథ ఎలా ఉన్నా కథనంలో మురుగదాస్ తన మార్క్ చూపించాడని చెప్పొచ్చు. మంచి కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఫస్టాఫ్ చాలా సరదాగా, రొమాంటిక్‌గా, క్రేజీగా సాగిపోయింది. ఇక సెకండాఫ్‌లో అసలు స్టోరీ మొదలవుతుంది. యాక్షన్ సీన్స్ తో పాటు సెంటిమెంట్ సీన్స్‌తో కట్టిపడేశాడు మురుగదాస్.
ఇక రజినీ సినిమా వస్తుందంటే హంగామా ఏ లెవెల్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్క ఒక్కో హీరోకు కొంతమంది ఫ్యాన్స్ వుంటారు.. కానీ అందరి హీరోల ఫ్యాన్స్ అభిమానించే ఏకైక సూపర్ స్టార్ మాత్రం రజినీనే. ఆయన స్టైల్ గురించి కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాల్లో చూసాం. చూస్తూనే ఉన్నాం. చాలా రోజుల తర్వాత రజినీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో యంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా ఇరగదీసాడు. రజనీ మార్క్ డైలాగ్స్, మేనరిజం, ఇతర అంశాలు ప్రేక్షకులను థియేటర్‌కు పరుగులు పెట్టిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తన మార్క్ స్టైల్ తో 70 ఏళ్ల వయసులో రజినీ చేసిన యాక్షన్ కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. రజినీ ఫాన్స్ అందరికీ ఈ సంక్రాంతి పండుగకు ఫుల్ మీల్స్ దొరికనట్లే అని చెప్పొచ్చు.
చంద్రముఖి సినిమాలో రజినీ, నయనతార మధ్య కామెడీ తో కూడిన కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో కూడా మరోసారి సందడి చేశారు. ఇక రజినీ కూతురిగా చేసిన నివేదా కూడా తన నటనతో మరోసారి ప్రేక్షకులను మెప్పించింది. నివేద థామస్ కు చాలా మంచి పాత్ర పడింది. రజినీ తర్వాత గుర్తుండిపోయే పాత్ర ఈమెదే. నివేదా థామస్‌తో రజినీకాంత్ సీన్స్ ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తాయి. ఇక సినిమాలో విలన్ గా నటించిన సునీల్ శెట్టి బాగా చేశాడు.
ఇక అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ఎంతో ప్లస్‌గా అని చెప్పొచ్చు. అంతేకాదు సంతోషన్ శివన్ సినిమాటోగ్రఫీ సినిమాకు మరో హైలెట్‌గా. సెకండ్ ఆఫ్‌తో పోలిస్తే ఫస్ట్ హాఫ్ సినిమాకు ప్లస్ అవుతుండగా.. ఫస్ట్ ఆఫ్ మొత్తం రజినీ వన్ మ్యాన్ షో ఉంటుంది.
ఓవరాల్ గా చెప్పాలంటే మంచి కమ్ బ్యాక్ తో వచ్చారు రజినీ, మురుగదాస్. ఇన్ని రోజులు ఎదురుచూసిన రజినీ అభిమానులకు మంచి కిక్ ఇచ్చే సినిమా ‘దర్బార్’ అని చెప్పడం ఎలాంటి సందేహం లేదు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: