డైరెక్టర్ నంబర్ వన్ ఎస్.ఎస్. రాజమౌళి రూపొందిస్తున్న మల్టీస్టారర్ `ఆర్ ఆర్ ఆర్`. వాస్తవ పాత్రలు, కల్పిత ఘట్టాలతో రూపొందుతున్న ఈ ఊహాజనిత చారిత్రక చిత్రంలో.. కొమరం భీమ్ గా యంగ్ టైగర్ యన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రస్తుతం మెరుపు వేగంతో చిత్రీకరణ జరుపుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజా కథనాల ప్రకారం.. `ఆర్ ఆర్ ఆర్`కి సంబంధించిన షూటింగ్ వికారాబాద్ సమీపంలోని దట్టమైన అడవుల్లో జరుగుతోందని తెలిసింది. వారం రోజుల పాటు సాగే ఈ నైట్ ఎఫెక్ట్ షెడ్యూల్ లో చరణ్ బృందంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు వినికిడి. ఈ షెడ్యూల్ లో తారక్ స్క్రీన్ షేర్ చేసుకోవడం లేదని టాక్. కాగా, మార్చి నెలాఖరుకల్లా `ఆర్ ఆర్ ఆర్` షూటింగ్ పూర్తిచేసి.. ఆపై నాలుగు నెలల పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరిపే దిశగా జక్కన్న ప్రణాళిక రచించాడట.
కీరవాణి బాణీలతో రూపొందుతున్న `ఆర్ ఆర్ ఆర్`.. జూలై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























