స్టాండప్ కమిడియన్ గా..?

Pooja Hegde to Play An Interesting Role,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Pooja Hegde Latest News,Pooja Hegde Upcoming Movie News,Pooja Hegde Next Film Updates,Pooja Hegde Latest Movie Details

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ 4వ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో పూజా హెగ్డే రోల్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. పూజా హెగ్డే ఓ స్టాండప్ కమిడియన్ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ పాత్ర కోసం పూజ తెగ కష్టపడిపోతుందట. కొంతమంది స్టాండప్ కమెడియన్స్ ని కలుస్తూ ట్రైనింగ్ తీసుకుంటోందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై రూపొందించనున్నారు. గోపి సుందర్ సంగీతంఅందిస్తున్నారు.

ఇక ఈ సినిమాతో పాటు పూజ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అలవైకుంఠపురంలో’ మూవీలో కూడా ప్రధాన నాయకిగా పూజా నటిస్తుంది. మరో రెండు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో పాటు ప్రభాస్ సినిమాలో కూడా పూజా నటిస్తుంది.

మరి అఖిల్, హలో, మిస్టర్ మజ్ను సినిమాలతో ఆశించిన ఫలితం రాబట్టక పోవడంతో కనీసం నాలుగో సినిమాతోనైనా బ్రేక్ తెచ్చుకోవాలని కసిగా ఉన్నాడు అక్కినేని అఖిల్. మరి ఎప్పటినుండో మంచి హిట్ కొట్టాలని చూస్తున్న అఖిల్ కోరిక ఈ సినిమాతో అయినా తీరుతుందో..? లేదో..? చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 3 =