శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఏ కె ఎంటర్ టైన్ మెంట్స్, జిఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “సరిలేరు నీకెవ్వరు” మూవీ జనవరి 11 వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. విజయశాంతి, సంగీత, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటించారు. మిల్కీ బ్యూటీ తమన్నా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“సరిలేరు నీకెవ్వరు” మూవీ యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకొని మూవీ పై అంచనాలు పెంచాయి. ట్రైలర్ తో ప్రేక్షకుల అంచనాలు అంబరాన్ని తాకుతున్నాయి.మూవీ ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ భారీ గా చేపట్టింది. తాజా గా ఒక మేకింగ్ వీడియో ను “ది వైబ్ ఆఫ్ సరిలేరు నీకెవ్వరు” పేరుతో రిలీజ్ చేసింది. ఆ మేకింగ్ వీడియో లో మూవీ నటీనటులు, టెక్నీషియన్స్ నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ మూవీ మేకింగ్ లో పాల్గొనడం ఇంప్రెస్ చేసింది. ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్ హై లెట్ అయ్యేలా ఉంది. “సరిలేరు నీకెవ్వరు” మూవీ పై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: