య‌న్టీఆర్ `శ్రీ వేంక‌టేశ్వ‌ర మ‌హాత్మ్యం`కి 60 వ‌సంతాలు

Sr NTR Sri Venkateswara Mahatyam Completes 60 Years

ఆంధ్రుల‌ ఆరాధ్య దైవం శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి పాత్ర‌లో తెలుగువారి న‌ట‌దైవం నంద‌మూరి తార‌క రామారావు జీవించిన చిత్రం `శ్రీ వెంక‌టేశ్వ‌ర మ‌హాత్మ్యం`. అల‌నాటి అగ్ర‌శ్రేణి ద‌ర్శ‌కుడు పి.పుల్ల‌య్య రూపొందించిన ఈ చిత్రరాజంలో ల‌క్ష్మీ దేవి పాత్ర‌ను ఎస్. వ‌ర‌ల‌క్ష్మి ధ‌రించ‌గా, ప‌ద్మావ‌తి పాత్ర‌ను సావిత్రి పోషించారు. `ప‌ద్మ‌శ్రీ వారి` ప‌తాకంపై వి.వేంక‌టేశ్వ‌ర్లు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించిన ఈ మైథ‌లాజిక‌ల్ ఫిల్మ్ లో చిత్తూరు వి. నాగ‌య్య‌, శాంత కుమారి, గుమ్మ‌డి, షావుకారు జాన‌కి, రుష్యేంద్ర‌మ‌ణి, రాజ‌నాల‌, రేలంగి, ర‌మ‌ణారెడ్డి త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆచార్య ఆత్రేయ క‌థ‌నం, సంభాష‌ణ‌లు అందించిన ఈ ఆధ్యాత్మిక చిత్రానికి దిగ్గ‌జ స్వ‌ర‌క‌ర్త పెండ్యాల నాగేశ్వ‌ర‌రావు బాణీలు అందించారు. ఇందులోని అన్ని పాట‌లూ విశేషాద‌ర‌ణ పొందాయి. మ‌రీ ముఖ్యంగా లెజెండ‌రీ సింగ‌ర్, మ్యూజిక్ కంపోజ‌ర్ ఘంట‌సాలపై చిత్రీక‌రించిన `శేష‌శైలా వాస‌` గీత‌మైతే నిత్య‌నూత‌నంగా నిల‌చింది. థియేట‌ర్ల‌ను దేవాల‌యాలుగా మార్చివేసిన `శ్రీ వేంక‌టేశ్వ‌ర మ‌హాత్మ్యం`.. 1960 జ‌న‌వ‌రి 9న విడుద‌లైంది. అంటే.. నేటితో ఈ జ‌న‌రంజ‌క చిత్రం జ‌నం ముందుకొచ్చి 60 వ‌సంతాలు పూర్త‌వుతున్నాయ‌న్న‌మాట‌.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.