ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 200
సరిలేరు నీకెవ్వరు మూవీ పబ్లిక్ ఒపీనియన్
ఫస్ట్ మంచు లక్ష్మీ - తర్వాత వెంకీ..!
'డిస్కోరాజా' నుండి టీజర్ 2.0
'భీష్మ' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

సితార-ఆద్య లతో రష్మిక సందడి

జాన్వీ కోసం ముంబైకే మకాం మార్చిన పూరీ..!

థమన్ పై కన్నేసిన బాలీవుడ్..!
త్రివిక్రమ్ శ్రీనివాస్ పై అల్లు అర్జున్ ప్రశంసలు

'దర్బార్' ఫస్ట్ డే కలెక్షన్స్
మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి
తండ్రి డైరెక్షన్ లో టాలీవుడ్ ఎంట్రీ ప్లాన్..?

"సరిలేరు నీకెవ్వరు" మూవీ లో మహేష్ బాబు మాస్ లుక్
`మహాసముద్రం`లో సమంత?

2020 జనవరి.. కేరాఫ్ ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్
సంక్రాంతికి కొనసాగుతున్న `రీ-ఎంట్రీ` సందడి
బాలీవుడ్ మూవీ లో నటిస్తాను - అల్లు అర్జున్
డాన్స్, ఫైట్స్, యాక్టింగ్ తో ప్రేక్షక, అభిమానులను అలరిస్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా అభిమానులను సంపాదించుకొన్నారు. అల్లు అర్జున్ హీరోగా నటించిన తెలుగు మూవీస్ హిందీ డబ్బింగ్ వెర్షన్స్ యూట్యూబ్ ద్వారా ప్రదర్శించడంతో నార్త్ లో అల్లు అర్జున్ పాప్యులారిటీ పెరిగింది. స్టైలిష్ స్టార్ గా పేరుపొంది అల్లు అర్జున్ టాలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్నారు.
సరిలేరు నీకెవ్వరు మూవీ పబ్లిక్ ఒపీనియన్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “పబ్లిక్ ఒపీనియన్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది.
ఫస్ట్ మంచు లక్ష్మీ - తర్వాత వెంకీ..!
పెళ్లిచూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తో మంచు లక్ష్మీ ఒక వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ ఈ వెబ్ సిరీస్ త్వరలోనే పట్టాలెక్కబోతున్నట్టు తెలుస్తుంది. నెట్ ఫ్లిక్స్ లో ఈ వెబ్ సిరీస్ ప్రసారం కానుంది. కాగా గతంలోనే సుబ్బలక్ష్మి అనే వెబ్ సిరీస్ లో నటించింది. వంశీ దర్శకత్వంలో రూపొందించిన ఈ వెబ్ సిరీస్‌లో మంచు లక్ష్మి టైటిల్ రోల్ ప్లే చేశారు. శ్రీనివాస్ అవసరాల, వేణు టిల్లు, మహేష్ విట్ట, సుదర్శన్, జబర్దస్త్ అప్పారావ్, చిత్రం శ్రీను కీలక పాత్రలు పోషించారు. ZEE5 యాప్ ద్వారా మిసెస్ సుబ్బలక్ష్మి ఎపిసోడ్స్‌ని చూడొచ్చు.
'డిస్కోరాజా' నుండి టీజర్ 2.0
వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ 'డిస్కోరాజా' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీనితో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చిన్నగా మొదలు పెట్టింది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈ సినిమా నుండి పాటలు, టీజర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
'భీష్మ' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా భీష్మ. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా షురూ చేసింది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్, సింగిల్ యాంథమ్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

సితార-ఆద్య లతో రష్మిక సందడి
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సితార, వంశీ పైడిపల్లి కూతురు ఆద్య కలిసి ఆద్య అండ్ సితార అనే యూ ట్యూబ్ ఛానల్ ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే వీరిద్దరూ కలిసి పలు వీడియోల ద్వారా ప్రేక్షకులము అలరించారు. ఇక ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రమోషన్ లో కూడా పాలుపంచుకున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన రష్మిక సితార-ఆద్య లతో కలిసి కాసేపు సందడి చేసింది. మీరు కూడా వారు చేసిన అల్లరిని చూసి ఎంజాయ్ చేయండి.

జాన్వీ కోసం ముంబైకే మకాం మార్చిన పూరీ..!
ప్రస్తుతం విజయ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే సినిమా బిజీలో వున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇజాబెల్లి లీట్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఫిబ్రవరి లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'ఫైటర్' సినిమా రాబోతున్న సంగతి కూడా తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పర్ట్ గా కనిపించనున్నాడట.

థమన్ పై కన్నేసిన బాలీవుడ్..!
2019 మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కు స్పెషల్ ఇయర్ అని చెప్పొచ్చు. వెంకీమామ, ప్రతి రోజూ పండగే, 'అల వైకుంఠపురములో', డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటరు', ఇంకా చాలా సినిమాలు వచ్చాయి. వచ్చిన అన్ని ఆడియోలు దాదాపు హిట్ అయ్యాయి. అందులో ముఖ్యంగా 'అల వైకుంఠపురములో' 'సామజవరగమనా', 'రాములో రాములా' పాటలు 2019 లోనే బెస్ట్ సాంగ్స్ గా అత్యధిక వ్యూస్ తో రికార్డ్ క్రియేట్ చేసాయి. అంతేకాదు బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాకి కూడా తమన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ఫైనల్ చేసుకున్నట్టు తెలుస్తుంది. మహేష్ బాబు, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కబోయే కొత్త సినిమాకి కూడా తమన్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా…

సంక్రాంతికి రానున్న చై-సాయి పల్లవి సినిమా ఫస్ట్ లుక్..!
శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా తాజాగా ఓ వార్త వినిపిస్తుంది. ఈ సినిమా నుండి ఇప్పటివరకూ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు చిత్రయూనిట్. ఈ నేపథ్యంలో ఈ సంక్రాంతికి ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. చూద్దాం మరి ఇందులో ఎంత నిజముందో..
త్రివిక్రమ్ శ్రీనివాస్ పై అల్లు అర్జున్ ప్రశంసలు
గీతా ఆర్ట్స్, హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా రూపొందిన "అల .. వైకుంఠపురములో .. " మూవీ జనవరి12వ తేదీ రిలీజ్ కానుంది. "అల .. వైకుంఠపురములో .. " మూవీ మలయాళ డబ్బింగ్ వెర్షన్ "అంగు వైకుంఠపురత్తు" అదే రోజు రిలీజ్ కానుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా రూపొందిన ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
కేరళ రాష్ట్రం లో "సరిలేరు నీకెవ్వరు" మూవీ రికార్డ్
సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా రూపొందిన "సరిలేరు నీకెవ్వరు" మూవీ జనవరి 11 వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కేరళరాష్ట్రంలో అదే రోజు 30 స్క్రీన్ లలో రిలీజ్ కానుంది. కేరళ రాష్ట్రం లో రిలీజవుతున్న ఫస్ట్ స్ట్రయిట్ తెలుగు మూవీగా "సరిలేరు నీకెవ్వరు" రికార్డ్ క్రియేట్ చేసింది.

'దర్బార్' ఫస్ట్ డే కలెక్షన్స్
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా స్టార్ డైరెక్టర్ ఏఆర్ ముగరుదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా దర్బార్. ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక దర్బార్ తో చాలా కాలం తర్వాత తలైవాకి ఒక హిట్ దక్కింది. తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా మంచి టాక్ తో దూసుకుపోతుంది. మరోసారి తన బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో నిరూపించాడు తలైవా. ముఖ్యంగా తమిళనాడులో బెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకుంది. దాదాపు 15కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక తెలుగులో కూడా పర్వాలేదనిపించే విధంగా రాబట్టినట్లు తెలుస్తుంది. మరి చూద్దాం ఏయే ఏరియాల్లో దర్బార్ సినిమా ఎంత కలెక్ట్ చేసిందో..
మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి
ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి చారిత్రాత్మక నవల పొన్నియిన్ సెల్వన్ ఆధారంగా "పొన్నియిన్ సెల్వన్" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. సుభాస్కరన్ సమర్పణ లో లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్స్ పై సీనియర్ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో చోళ రాజు రాజ రాజ చోళన్ జీవిత చరిత్ర ఆధారంగా "పొన్నియిన్ సెల్వన్" తమిళ మూవీ 2భాగాలుగా రూపొందుతుంది. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
తండ్రి డైరెక్షన్ లో టాలీవుడ్ ఎంట్రీ ప్లాన్..?
సినీ ఇండస్ట్రీలోకి వారసులుగా అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వెండి తెరకు వస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది వారసులు రాగా ఇప్పుడు మరో వారసురాలు తెలుగు తెరపై రావడానికి సిద్ధమైంది. ఆమె ఎవరో కాదు యాక్షన్ కింగ్ గా ఒకప్పుడు తనదైన శైలిలో సినిమాలు చేసి సౌత్ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేసిన అర్జున్ కూతురు ఐశ్వర్య. ఇప్పటికే తమిళ్ లో కొన్ని సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది ఐశ్వర్య. అయితే ఆ మధ్య తెలుగులో ఛాన్స్ వచ్చినా కూడా చేయలేదు.

"సరిలేరు నీకెవ్వరు" మూవీ లో మహేష్ బాబు మాస్ లుక్
సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "సరిలేరు నీకెవ్వరు" మూవీ జనవరి 11 వతేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. బ్లాక్ బస్టర్స్ "భరత్ అనే నేను" , "మహర్షి" మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన మహేష్ బాబు మరో ఎంటర్ టైనర్ మూవీ "సరిలేరు నీకెవ్వరు" తో ప్రేక్షకులను అలరించనున్నారు. 13 సంవత్సరాల తరువాత లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఒక కీలక పాత్రలో నటించిన ఈ మూవీ కై ప్రేక్షక, అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
`మహాసముద్రం`లో సమంత?
`ఆర్ ఎక్స్ 100` సెన్సేషన్ అజయ్ భూపతి.. స్వల్ప విరామం తరువాత మరోమారు మెగాఫోన్ పడుతున్నాడు. `మహాసముద్రం` పేరుతో రూపొందనున్న ఈ మల్టీస్టారర్ మూవీలో ఇప్పటికే శర్వానంద్ ఓ కథానాయకుడిగా ఎంపిక కాగా, మరో హీరో కోసం అన్వేషణ సాగుతోంది. ఇదిలా ఉంటే... ఇందులో కథానాయిక పాత్ర కోసం స్టార్ హీరోయిన్ సమంతతో అజయ్ సంప్రదింపులు జరిపాడని, కథ - పాత్ర నచ్చడంతో సామ్ కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఫిల్మ్ నగర్ ఇన్ ఫర్మేషన్.

2020 జనవరి.. కేరాఫ్ ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్
2020 జనవరి... బాలీవుడ్ లో వెరీ స్పెషల్ కానుంది. ఎందుకంటే.. ఈ నెలలో ఏకంగా మూడు ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ సందడి చేయబోతున్నాయి. వాటిలో రెండు స్ట్రయిట్ పిక్చర్స్ కాగా, మరొకటి మల్టీలింగ్వల్ మూవీ. ఆ సినిమాలే.. `ఛపాక్`, `పంగా`, `నిశ్శబ్దం`.
`దిల్`రాజు సంక్రాంతి విజయపరంపరని కొనసాగిస్తాడా?
సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ `దిల్` రాజుకి అచ్చొచ్చిన సీజన్స్ లో సంక్రాంతి ఒకటి. `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`(2013) మొదలుకుని `ఎవడు`(2014), `శతమానం భవతి`(2017), `ఎఫ్ 2` (2019) వరకు ముగ్గుల పండక్కి వచ్చిన ప్రతీ `దిల్` రాజు సినిమా కమర్షియల్ గా సూపర్ సక్సెస్ అయింది.
సంక్రాంతికి కొనసాగుతున్న `రీ-ఎంట్రీ` సందడి
సంక్రాంతి.. టాలీవుడ్ ఫరెవర్ బెస్ట్ సీజన్. అందుకే.. ఈ సీజన్ లో తమ సినిమాలను రిలీజ్ చేయాలని అన్ని వర్గాల వారు ప్రయత్నాలు చేస్తుంటారు. శుభప్రదమైన ఈ పర్వదినంకి గత కొంతకాలంగా ఓ ప్రత్యేకత ఆపాదించబడుతోంది. అదేమిటంటే.. 2017 నుంచి ప్రతీ ఏడాది సంక్రాంతికి ప్రముఖులు `రీ-ఎంట్రీ` ఇవ్వడం ఆనవాయితీగా మారుతోంది.
`సరిలేరు నీకెవ్వరు`కి ఆ సెంటిమెంట్ మరోసారి వర్కవుట్ అవుతుందా?
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటివరకు ఐదు సార్లు సంక్రాంతి బరిలో దిగాడు. `టక్కరిదొంగ` (2002), `ఒక్కడు` (2003), `బిజినెస్ మేన్`(2012), `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`(2013), `1-నేనొక్కడినే`(2014).. ఇలా వేర్వేరు సంవత్సరాల్లో ఐదు విభిన్న కథాంశాలతో మహేష్ సంక్రాంతికి సందడి చేశాడు. వీటిలో `టక్కరిదొంగ`, `1-నేనొక్కడినే` మినహా మిగిలిన మూడు చిత్రాలు కూడా కమర్షియల్ గా సెన్సేషన్ క్రియేట్ చేశాయి.