కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 197

షూటింగ్ అప్‌డేట్

నాని 'V' షూటింగ్ పూర్తి

మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో నాని హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా 'V'. గతకొద్ది రోజుల ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సుధీర్ బాబు , నివేత థామస్, అదితి రావు హైదరి ముఖ్య పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 25 వ తేదీన రిలీజ్ కానుంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ నిన్నటి తో పూర్తి చేసుకుంది. ఈ చిత్ర షూటింగ్ నిన్నటితో మొత్తం పూర్తయిందని నాని తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

ఫిబ్ర‌వ‌రి తొలి వారం నుంచి బ‌న్నీ, సుక్కు మూవీ నెక్స్ట్ షెడ్యూల్

`అల వైకుంఠ‌పురములో`తో మ‌రో ఘ‌న‌విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఒక‌వైపు ఈ సినిమా స‌క్సెస్ ని ఆస్వాదిస్తూనే... మ‌రోవైపు నెక్స్ట్ ఫిల్మ్ షూటింగ్ కి సిద్ధ‌మ‌వుతున్నాడు బ‌న్నీ. బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ రూపొందిస్తున్న‌ ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ లో ఈ అల్లు స్టార్... ఇదివ‌ర‌కెన్న‌డూ క‌నిపించ‌ని పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

`స‌రిలేరు నీకెవ్వ‌రు`.. మ‌హేష్ ఖాతాలో మూడు హ్యాట్రిక్స్

`స‌రిలేరు నీకెవ్వ‌రు`తో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని త‌న ఖాతాలో వేసుకున్నాడు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు. అంతేకాదు.. ఈ సినిమాతో మూడు ర‌కాల హ్యాట్రిక్స్ త‌న వ‌శం చేసుకున్నాడు ఈ ఘ‌ట్ట‌మ‌నేని హ్యాండ్సమ్ హీరో.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సింగ‌ర్ గా మాస్ మ‌హారాజా... హిట్ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా?

మాస్ మ‌హారాజా ర‌వితేజ మంచి న‌టుడు మాత్ర‌మే కాదు మంచి గాయ‌కుడు కూడా. `బ‌లుపు`(2013) కోసం `కాజ‌ల్ చెల్లివా` పాట‌లోని సాకీని, `ప‌వ‌ర్`(2014) కోసం `నోటంకి నోటంకి` పాట‌ని అల‌వోక‌గా పాడి బ్యాక్ టు బ్యాక్ క‌మ‌ర్షియ‌ల్ హిట్స్ అందుకున్నాడు ఈ టాలెంటెడ్ స్టార్. అంతేకాదు.. ప్రీవియ‌స్ బ్లాక్ బ‌స్ట‌ర్ `రాజా ది గ్రేట్`(2017)లోనూ టైటిల్ ట్రాక్ లో త‌న స్వ‌రాన్ని వినిపించాడు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పూజా హెగ్డే ఖాతాలో ఏడాదికో `మెగా` హిట్

వ‌రుస విజ‌యాల‌తో ముందుకు సాగుతున్న క‌థానాయిక‌ల్లో పూజా హెగ్డే ఒక‌రు. రీసెంట్ గా రిలీజైన `అల వైకుంఠ‌పుర‌ములో`తో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ ని త‌న సొంతం చేసుకుందీ స్ట‌న్నింగ్ బ్యూటీ. ఇదిలా ఉంటే.. పూజ టాలీవుడ్ కెరీర్ ని ప‌రిశీలిస్తే ఓ విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది. అదేమిటంటే... 2017 నుంచి ఏడాదికో మెగా కాంపౌండ్ హీరోతో జ‌ట్టుక‌ట్ట‌డ‌మే కాకుండా.. విజ‌యాల‌ను ఒడిసిప‌ట్టుకుంటోంది ఈ టాలెంటెడ్ బ్యూటీ.

Team TFNవాట్సాప్
Manchu Vishnu New Web Series Details,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Vishnu Manchu bets big on three new films and a web series,Vishnu Manchu Bets Big on 3 New Films And Web Series,Vishnu Manch
సినిమా వార్తలు

మంచు విష్ణు వెబ్ సిరీస్ 'చదరంగం'

ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టి సినిమాలు తీస్తున్నాడు మంచు విష్ణు. వాటితోపాటు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లోకి కూడా అడుగుపెట్టడానికి రెడీ అయ్యాడు. నటుడు శ్రీకాంత్ ప్ర‌ధాన పాత్ర‌ధారిగా రాజ్ దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది. ఆంధ్రప్ర‌దేశ్‌లో జ‌రిగిన కొన్ని వాస్త‌వ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమా వెబ్‌సిరీస్‌ను తెర‌కెక్కించారు.

TFN Adminవాట్సాప్
Arvind Swami MGR Look Out Tomorrow
ఫస్ట్ లుక్

'తలైవి' నుండి రానున్న 'ఎం.జి.ఆర్' ఫస్ట్ లుక్

ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్ 'తలైవి' రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జయలలిత పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగన రనౌత్ నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
RRR Movie Highlight Element Revealed
సినిమా వార్తలు

'ఆర్ఆర్ఆర్' ఆ పోరాట సన్నివేశాలు హైలైట్ అట..!

బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆతృతగా ఉన్నారు తెలుగు ప్రేక్షకులు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. 80 శాతం షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుంది ఈ సినిమా.

TFN Adminవాట్సాప్
Kajal To Play A Negative Role
సినిమా వార్తలు

భారతీయుడు2 లో విలన్ గా..?

శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన 'భారతీయుడు' సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు 23 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ 'భారతీయుడు2' ను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
అమెజాన్ లో వచ్చేసిన 90ML
సినిమా వార్తలు

అమెజాన్ లో వచ్చేసిన 90ML

బోల్డ్‌ లవ్‌ స్టోరిగా తెరకెక్కిన ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో సెన్సేషన్‌ సృష్టించాడు కార్తికేయ. ఈ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు ఈ యంగ్ హీరో. యూత్ లో మంచి ఫాలోయింగ్ ను ఏర్పరుచుకున్నాడు కార్తికేయ. ఇక ఈ సినిమా విజయంతో వరుస అవకాశాలు కార్తికేయ తలుపు తట్టాయి. ఇక అటుపై కార్తికేయ హిప్పీ, గుణ 369లాంటి చిత్రాలతో పలకరించి మంచి విజయాలను అందుకున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఎంత మంచివాడవురా మూవీ పబ్లిక్ ఒపీనియన్

ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “పబ్లిక్ ఒపీనియన్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది.

Team TFNవాట్సాప్
Sarileru Neekevvaru Movei Blockbuster Ka Baap Celebrations,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Sarileru Neekevvaru Movie Updates,Sarileru Neekevvaru Telugu Movie Latest News,Sarileru Neekevvaru Col
సినిమా వార్తలు

'సరిలేరు నీకెవ్వరు' బ్లాక్ బస్టర్ కా బాప్ సెలెబ్రేషన్స్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస హిట్ లతో దూసుకుపోతున్నారు. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు ఇలా ఒకదాని తర్వాత ఒకటి హిట్స్ ఇస్తూ అటు అభిమానులను సైతం ఆనందంలో ముంచెత్తుతున్నారు. ఇక సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన ఈ సినిమా తొలిరోజు నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. మహేష్ బాబు అభినయం క్లాస్, మాస్ ఆడియన్స్ అందరినీ ఆకట్టుకుంది. అనిల్ రావిపూడి స్టైల్ ఆఫ్ కామెడీ ఫ్యామిలీ ప్రేక్షకుల మనసు దోచుకుంది.

TFN Adminవాట్సాప్
Ravi Teja Krack Movie Pongal Poster Rocks
ఫస్ట్ లుక్

రవితేజ 'క్రాక్' మూవీ పొంగల్ పోస్టర్ అదిరింది

మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'క్రాక్' సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. డాన్ శ్రీను, బలుపు తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న మూడవ సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఈసినిమా ఫస్ట్ లుక్ ను ఇటీవలే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. రవితేజ పక్కా మాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్టు అర్థమైంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

చిరంజీవి, విజ‌య‌శాంతి... సేమ్ టు సేమ్

తెలుగునాట సంక్రాంతి సీజ‌న్.. ప‌లువురి ప్ర‌ముఖుల రీ-ఎంట్రీకి వేదిక‌గా నిలుస్తోంది. మరీ ముఖ్యంగా.. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌ని శాసించిన ఇద్ద‌రు అగ్ర‌శ్రేణి న‌టులు మూడేళ్ళ గ్యాప్ లో సిల్వ‌ర్ స్క్రీన్ పై సుదీర్ఘ విరామం త‌రువాత సంద‌డి చేయ‌డ‌మే కాకుండా.. ఘ‌న‌విజ‌యాలు అందుకోవ‌డం వార్త‌ల్లో నిలుస్తోంది. ఆ ఇద్ద‌రు మ‌రెవ‌రో కాదు... ప‌లు చిత్రాల్లో జంట‌గా మురిపించిన మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూప‌ర్ స్టార్ విజ‌య‌శాంతి. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే... ఈ ఇద్ద‌రి రీ-ఎంట్రీ ఫిల్మ్స్ కి సంబంధించి మూడు కామ‌న్ ఫ్యాక్ట‌ర్స్ ఉన్నాయి.

Team TFNవాట్సాప్
Megastar Chiranjeevi Anji Completes 16 Years
సినిమా వార్తలు

మెగాస్టార్ చిరంజీవి `అంజి`కి ప‌ద‌హారేళ్ళు

తెలుగునాట ప‌లు గ్రాఫిక‌ల్ వండ‌ర్స్ రూపొందాయి. వాటిలో `అంజి` ఒక‌టి. మెగాస్టార్ చిరంజీవి లాంటి ఓ స్టార్ హీరో.. ఇలాంటి విజువ‌ల్ ఎఫెక్ట్స్ బేస్డ్ సినిమాలో న‌టించ‌డం అప్ప‌ట్లో వార్త‌ల్లో నిల‌చింది. `అమ్మోరు` వంటి విజువ‌ల్ వండ‌ర్ త‌రువాత దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు కోడి రామ‌కృష్ణ‌, అగ్ర నిర్మాత ఎం. శ్యామ్ ప్ర‌సాద్ రెడ్డి కాంబినేష‌న్ లో వ‌చ్చిన ఈ చిత్రం.. క‌మ‌ర్షియ‌ల్ గా ఆశించిన స్థాయిలో మెప్పించ‌క‌పోయినా, ఒక మంచి ప్ర‌య‌త్నంగా మాత్రం మిగిలిపోయింది. మ‌రీ ముఖ్యంగా... ఇందులోని ఆరంభ‌, ముగింపు స‌న్నివేశాలు ఇప్ప‌టికీ చ‌ర్చ‌నీయాంశంగా సాగుతుండ‌డం విశేషం. అంతేకాదు... ఈ సినిమాలోని ఆ స్పెష‌ల్ ఎఫెక్ట్స్ కి ఇటు నంది…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి జోడీగా పూజా హెగ్డే?

హిందీనాట ఘ‌న‌విజ‌యం సాధించిన `పింక్`... త‌మిళంలో `నేర్ కొండ పార్ వై` పేరుతో రీమేక్ అయి అక్క‌డా బ్లాక్ బ‌స్ట‌ర్ బాట ప‌ట్టింది. అంతేకాదు.. ఇప్పుడా ఎమోష‌న‌ల్ కోర్ట్ డ్రామా తెలుగులోనూ రీమేక్ అవుతోంది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రీ-ఎంట్రీ ఫిల్మ్ గా తెర‌కెక్క‌నున్న ఈ రీమేక్ కి `లాయ‌ర్ సాబ్` అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. `దిల్` రాజు, బోనీ క‌పూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వేణు శ్రీ‌రామ్ డైరెక్ట్ చేస్తున్నాడు.

Team TFNవాట్సాప్
Music Director Thaman Gives Back To Back Blockbuster Hits
సినిమా వార్తలు

బ‌్లాక్ బ‌స్ట‌ర్ హ‌్యాట్రిక్ కొట్టిన థ‌మ‌న్

యువ సంగీత సంచ‌ల‌నం థ‌మ‌న్ మ‌ళ్ళీ ఫామ్ లోకి వ‌చ్చేశాడు. వ‌రుస విజ‌యాల‌తో దూకుడు చూపిస్తున్నాడు. మ‌రీ ముఖ్యంగా... నెల రోజుల గ్యాప్ లో ఈ టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజ‌ర్ మూడు విజ‌యాల‌ను సొంతం చేసుకోవ‌డం వార్త‌ల్లో నిలుస్తోంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

చై-సాయి పల్లవి సినిమా టైటిల్ రిలీజ్

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ సినిమా నుండి ఇప్పటివరకూ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు చిత్రయూనిట్. అయితే ఈ సంక్రాంతికి ఈ సినిమా టైటిల్ రాబోతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అనుకున్నట్టే ఈ రోజు ఈ సినిమా టైటిల్ ను రిలీజ్ చేసారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
Korean Movie Telugu Remake Comes As Lady Multistarrer Movie
సినిమా వార్తలు

లేడీ ముల్టీస్టారర్ గా మరో 'కొరియన్ రీమేక్'

కొత్త కొత్త టాలెంట్స్ ను ప్రోత్సహిస్తూ ఒకపక్క చిన్న సినిమాలతో.. మరో పక్క పెద్ద సినిమాలతో హిట్స్ కొడుతూ గత కొన్ని సంవత్సరాలుగా టాప్ ప్లేస్ లో దూసుకుపోతుంది సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్. డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు తీస్తూ నిర్మాణ రంగంలో దూసుకుపోతుంది. ఇక ఇప్పుడు మరో ప్రయోగానికి రెడీ అయింది. రీసెంట్ గా కొరియా సినిమా 'మిస్‌ గ్రానీ' ని ‘ఓ బేబీ’ గా రీమేక్ చేసి మంచి హిట్టు కొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో కొరియన్ మూవీని రీమేక్ చేయాలనీ చూస్తున్నారట సురేష్ బాబు.

TFN Adminవాట్సాప్

షేర్