సింగ‌ర్ గా మాస్ మ‌హారాజా… హిట్ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా?

Ravi Teja Banks On This Sentiment For His Movie Success

మాస్ మ‌హారాజా ర‌వితేజ మంచి న‌టుడు మాత్ర‌మే కాదు మంచి గాయ‌కుడు కూడా. `బ‌లుపు`(2013) కోసం `కాజ‌ల్ చెల్లివా` పాట‌లోని సాకీని, `ప‌వ‌ర్`(2014) కోసం `నోటంకి నోటంకి` పాట‌ని అల‌వోక‌గా పాడి బ్యాక్ టు బ్యాక్ క‌మ‌ర్షియ‌ల్ హిట్స్ అందుకున్నాడు ఈ టాలెంటెడ్ స్టార్. అంతేకాదు.. ప్రీవియ‌స్ బ్లాక్ బ‌స్ట‌ర్ `రాజా ది గ్రేట్`(2017)లోనూ టైటిల్ ట్రాక్ లో త‌న స్వ‌రాన్ని వినిపించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

క‌ట్ చేస్తే.. రెండున్న‌రేళ్ళ త‌రువాత `డిస్కో రాజా` కోసం మ‌రోసారి గొంతు స‌వ‌రించుకున్నాడు ర‌వితేజ‌. `ర‌మ్ ప‌మ్ బ‌మ్` అంటూ సాగే ఈ ఎన‌ర్జిటిక్ నంబ‌ర్ ని నిన్న‌టి త‌రం స్టార్ కంపోజ‌ర్, `డిస్కో కింగ్` బ‌ప్పీల‌హ‌రితో క‌ల‌సి థ‌మ‌న్ స్వ‌ర‌క‌ల్ప‌న‌లో పాడాడు మాస్ మ‌హారాజా. `డిస్కో రాజా`కి ఓ హైలైట్ గా నిల‌వ‌నున్న ఈ సాంగ్ ని ఈ రోజు (గురువారం) సాయంత్రం రిలీజ్ చేయ‌నున్నారు. మ‌రి… పాట పాడిన ప్ర‌తీ సారి హిట్ కొట్టిన ర‌వితేజ‌… `డిస్కో రాజా` విషయంలోనూ ఆ ఫీట్ ని రిపీట్ చేస్తాడేమో చూడాలి.

వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన `డిస్కో రాజా`.. ఈ నెల 24న జ‌నం ముందుకు రానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + seventeen =