లేడీ ముల్టీస్టారర్ గా మరో ‘కొరియన్ రీమేక్’

Korean Movie Telugu Remake Comes As Lady Multistarrer Movie

కొత్త కొత్త టాలెంట్స్ ను ప్రోత్సహిస్తూ ఒకపక్క చిన్న సినిమాలతో.. మరో పక్క పెద్ద సినిమాలతో హిట్స్ కొడుతూ గత కొన్ని సంవత్సరాలుగా టాప్ ప్లేస్ లో దూసుకుపోతుంది సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్. డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు తీస్తూ నిర్మాణ రంగంలో దూసుకుపోతుంది. ఇక ఇప్పుడు మరో ప్రయోగానికి రెడీ అయింది. రీసెంట్ గా కొరియా సినిమా ‘మిస్‌ గ్రానీ’ ని ‘ఓ బేబీ’ గా రీమేక్ చేసి మంచి హిట్టు కొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో కొరియన్ మూవీని రీమేక్ చేయాలనీ చూస్తున్నారట సురేష్ బాబు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇంతకీ ఆ సినిమా ఏంటంటే.. 2017లో వచ్చిన ‘మిడ్ నైట్ రన్నర్స్’. ఈ యాక్షన్ కామెడీ సినిమాను రీమేక్ చేయాలని సురేష్ బాబు భావిస్తున్నారట. పోలీస్ అకాడమిలో ట్రైనింగ్ అవుతున్న ఇద్దరు పోలీస్ లు..అత్యుత్సాహంతో ట్రైనింగ్ పూర్తికాకుండానే ఓ కిడ్నాప్ కేసుని సాల్వ్ చేయటానికి బయిలుదేరతాడు. ఆ క్రమంలో రకరకాల సమస్యలు వస్తాయి. వాటిని దాటుకుని…ఆ కిడ్నాప్ వెనక ఉన్న ఓ పెద్ద రాకెట్ ని బయిటపెడతారు ఇదే స్టోరీ లైన్.

[custom_ad]

ఐతే ఇక్కడే ఒక ట్విస్ట్ వుంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఉండగా.. సురేష్ బాబు హీరోలతో కాకుండా హీరోయిన్లతో సినిమా తీయాలని చుస్తున్నట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా ప్రారంభమయ్యాయట. అంతేనా ఆ పాత్రలకు రెజీనా, నివేదా థామస్‌ల పేర్లను పరిశీలిస్తున్నారట. ఈ సినిమాకు సుధీర్‌ వర్మ అయితే దర్శకుడిగా పర్ఫెక్ట్ అన్న ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్టుగా తెలుస్తోంది. చూద్దాం మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.