హిందీనాట ఘనవిజయం సాధించిన `పింక్`… తమిళంలో `నేర్ కొండ పార్ వై` పేరుతో రీమేక్ అయి అక్కడా బ్లాక్ బస్టర్ బాట పట్టింది. అంతేకాదు.. ఇప్పుడా ఎమోషనల్ కోర్ట్ డ్రామా తెలుగులోనూ రీమేక్ అవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ-ఎంట్రీ ఫిల్మ్ గా తెరకెక్కనున్న ఈ రీమేక్ కి `లాయర్ సాబ్` అనే టైటిల్ పరిశీలనలో ఉంది. `దిల్` రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఇదిలా ఉంటే.. తమిళ వెర్షన్ లో అజిత్ కి జోడీగా విద్యా బాలన్ అతిథి పాత్రలో దర్శనమివ్వగా… తెలుగునాట ఆ క్యారెక్టర్ లో స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే నటించబోతోందని ప్రచారం సాగుతోంది. అయితే, దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నివేదా థామస్, అంజలి కీలక పాత్రల్లో నటిస్తున్న `పింక్` రీమేక్ కి థమన్ బాణీలు అందిస్తున్నాడు. వేసవి చివరలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ థియేటర్లలో సందడి చేయనుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: