`స‌రిలేరు నీకెవ్వ‌రు`.. మ‌హేష్ ఖాతాలో మూడు హ్యాట్రిక్స్

Mahesh Babu Hits Three Tricks With Sarileru Neekevvaru

`స‌రిలేరు నీకెవ్వ‌రు`తో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని త‌న ఖాతాలో వేసుకున్నాడు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు. అంతేకాదు.. ఈ సినిమాతో మూడు ర‌కాల హ్యాట్రిక్స్ త‌న వ‌శం చేసుకున్నాడు ఈ ఘ‌ట్ట‌మ‌నేని హ్యాండ్సమ్ హీరో.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఆ వివ‌రాల్లోకి వెళితే… `భ‌ర‌త్ అనే నేను`, `మ‌హ‌ర్షి` త‌రువాత వ‌రుస‌గా మూడో ఘ‌న‌విజ‌యాన్ని అందుకుని హ్యాట్రిక్ అంకాన్ని పూర్తిచేసిన మ‌హేష్‌.. ఆ మూడు చిత్రాల‌కు స్వ‌రాలు అందించిన దేవిశ్రీ ప్ర‌సాద్ కాంబోలో మ‌రో హ్యాట్రిక్ చేర్చాడు. ఇక `సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు`, `మ‌హ‌ర్షి` త‌రువాత నిర్మాత `దిల్` రాజు కాంబినేష‌న్ లోనూ హ్యాట్రిక్ విజయాలు అందుకున్న‌ట్ల‌య్యింది. మొత్తానికి.. `స‌రిలేరు నీకెవ్వరు`తో మ‌హేష్ ఖాతాలో మూడు ర‌కాల హ్యాట్రిక్స్ చేరిన‌ట్ల‌య్యింది. మున్ముందు కూడా మ‌హేష్ ఈ విజ‌య ప‌రంప‌ర‌ని కొన‌సాగించాల‌ని ఆశిద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 15 =