రవితేజ ‘క్రాక్’ మూవీ పొంగల్ పోస్టర్ అదిరింది

Ravi Teja Krack Movie Pongal Poster Rocks

మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. డాన్ శ్రీను, బలుపు తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న మూడవ సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఈసినిమా ఫస్ట్ లుక్ ను ఇటీవలే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. రవితేజ పక్కా మాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్టు అర్థమైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఇక ఇప్పుడు మరో పోస్టర్ ను రిలీజ్ చేసారు చిత్రయూనిట్. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా నుండి రవితేజ తో పాటు ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న శృతిహాసన్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ పొంగల్ పోస్టర్ అదిరిపోయిందని చెప్పొచ్చు. శృతిహాసన్ చీరకట్టుకొని బైక్ తోలుతూ.. ముందు ఒక బాబు.. వెనుక రవితేజ పంచె కట్టులో కూర్చొని ఉండగా ఈ పోస్టర్ ఆకట్టుకుంటుంది. మరి చూడబోతే ఈ సినిమా లో కామెడీ బాగానే పెట్టినట్టున్నాడు గోపి.

ఇక ఈ సినిమాలో రవితేజ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తుంది. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాని సమ్మర్ లో విడుదల చేయాలని అనుకుంటున్నారు చిత్ర బృందం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × two =