యువ సంగీత సంచలనం థమన్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చేశాడు. వరుస విజయాలతో దూకుడు చూపిస్తున్నాడు. మరీ ముఖ్యంగా… నెల రోజుల గ్యాప్ లో ఈ టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్ మూడు విజయాలను సొంతం చేసుకోవడం వార్తల్లో నిలుస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఆ వివరాల్లోకి వెళితే… గత నెలలో `వెంకి మామ` (డిసెంబర్ 13), `ప్రతి రోజూ పండగే` (డిసెంబర్ 20) రూపంలో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను అందుకున్న థమన్.. తాజాగా `అల వైకుంఠపురములో`(జనవరి 12)తో హ్యాట్రిక్ పూర్తి చేశాడు. అంటే.. నెల రోజుల గ్యాప్ లోనే ఈ యువ సంగీత సంచలనం మూడు వరుస విజయాలను చూశాడన్నమాట. మరి… థమన్ అప్ కమింగ్ ఫిల్మ్ `డిస్కో రాజా` కూడా ఇదే తీరున బ్లాక్ బస్టర్ అవుతుందేమో చూడాలి. రవితేజ హీరోగా నటిస్తున్న `డిస్కో రాజా` ఈ నెల 24న రిలీజ్ కానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: