తెలుగునాట పలు గ్రాఫికల్ వండర్స్ రూపొందాయి. వాటిలో `అంజి` ఒకటి. మెగాస్టార్ చిరంజీవి లాంటి ఓ స్టార్ హీరో.. ఇలాంటి విజువల్ ఎఫెక్ట్స్ బేస్డ్ సినిమాలో నటించడం అప్పట్లో వార్తల్లో నిలచింది. `అమ్మోరు` వంటి విజువల్ వండర్ తరువాత దిగ్గజ దర్శకుడు కోడి రామకృష్ణ, అగ్ర నిర్మాత ఎం. శ్యామ్ ప్రసాద్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం.. కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో మెప్పించకపోయినా, ఒక మంచి ప్రయత్నంగా మాత్రం మిగిలిపోయింది. మరీ ముఖ్యంగా… ఇందులోని ఆరంభ, ముగింపు సన్నివేశాలు ఇప్పటికీ చర్చనీయాంశంగా సాగుతుండడం విశేషం. అంతేకాదు… ఈ సినిమాలోని ఆ స్పెషల్ ఎఫెక్ట్స్ కి ఇటు నంది పురస్కారంతో పాటు అటు జాతీయ పురస్కారం కూడా దక్కడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
చిరుకి జోడీగా నమ్రతా శిరోద్కర్ నటించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, రీమాసేన్, రాజ్ లక్ష్మీ, ఆల్ఫోన్సా ప్రత్యేక గీతాల్లో సందడి చేశారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ స్వరకల్పనలో రూపొందిన పాటలన్నీ విశేషాదరణ పొందాయి. 2004 జనవరి 15న విడుదలైన `అంజి` నేటితో 16 వసంతాలను పూర్తిచేసుకుంటోంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: