బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆతృతగా ఉన్నారు తెలుగు ప్రేక్షకులు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. 80 శాతం షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుంది ఈ సినిమా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. అదేంటంటే.. బ్రిటీష్ వారితో వీరిద్దరూ కలిసి పోరాడే ఫైట్ సీన్ సినిమాకే హైలైట్ అవుతుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సీన్ ను రాజమౌళి అద్భుతంగా తెరకెక్కించారని, ఆయన శ్రమ తెరపై కనిపిస్తుందని అంటున్నారు.
ఇంకా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో దానయ్య డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: