“సాహసం శ్వాసగా సాగిపో సోదరా
సాగరం ఈదటం తేలికేం కాదురా…
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఏ కోవెలో చేరాలని కలగన్న పూబాలకి
సుడిగాలిలో సావాసమై దొరికింది ఈ పల్లకి
ఈ ఒక్కడు నీ సైన్యమై తోడుంటే చాలు…
[custom_ad]
కాలానికే తెలియాలిగా ముందున్న మలుపేమిటో
పోరాటమే తేల్చాలిగా రానున్న గెలుపేమిటో
ఈ ఒక్కడు నీ సైన్యమై తోడుంటే చాలు..“….
ఇదీ.. రెండున్నర గంటల `ఒక్కడు` సినిమాని మూడున్నర నిమిషాల పాట రూపంలో చెప్పడానికి దిగ్గజ గీతరచయిత `సిరివెన్నెల` సీతారామశాస్త్రి కూర్చిన అందమైన, అర్థవంతమైన అక్షరమాలిక. కథని క్లుప్తంగా ఎలాగైతే సిరివెన్నెల శ్రవణానందంగా మలిచారో.. అలాగే చిత్ర దర్శకుడు గుణశేఖర్ కూడా అంతే అద్భుతంగా తెరరూపమిచ్చారు.
[custom_ad]
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ ని మేలిమలుపు తిప్పిన ఈ చిత్రంలో భూమిక కథానాయికగా నటించగా… ప్రకాష్ రాజ్ ప్రతినాయకుడిగా నటించాడు. ఎమ్మెస్ రాజు ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ యాక్షన్ డ్రామాకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ బాణీలు అందించాడు. ఇందులోని ప్రతీ పాట చార్ట్ బస్టర్ గా నిలవడం విశేషం. అంతేకాదు.. ఈ సినిమా మణికి 50వ చిత్రం కావడం విశేషం. ఎనిమిది `నంది` పురస్కరాలతో పాటు ఫిల్మ్ ఫేర్ తో సహా పలు అవార్డులను అందుకున్న `ఒక్కడు` 2003 సంక్రాంతి విజేతగా నిలవడమే కాకుండా.. ఆ యేటి మేటి చిత్రాల్లో ఒకటిగా నిలచింది. 2003 జనవరి 15న విడుదలైన ఈ మ్యూజికల్ బ్లాక్ బస్టర్…. నేటితో 17 వసంతాలను పూర్తిచేసుకుంటోంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: