
ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 196


'అల వైకుంఠపురములో' వైభవంగా విజయోత్సవ వేడుకలు

ఎన్టీఆర్ ను మిస్ అవుతా..!

'ఎవరు' డైరెక్టర్ తో 'దిల్ రాజు' ముల్టీస్టారర్..?
'ఆర్ఆర్ఆర్' - పోలీస్ ఆఫీసర్ పాత్రలో..?
విభిన్న విలన్ క్యారెక్టర్స్ కు సై - రవితేజ

"తలైవి" మూవీ లో ఎమ్ జి ఆర్
రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రవితేజ?
మెగాస్టార్ చిరంజీవి `ముఠామేస్త్రీ`కి 27 ఏళ్ళు
`కర్తవ్యం` దర్శకుడితో సమంత చిత్రం?
`పింక్` రీమేక్ రిలీజ్ డేట్ ఫిక్స్?

చిరు టైటిల్స్ పై తమిళ్ హీరోల ఇంట్రెస్ట్..!

'F3'ని లైన్ లో పెట్టనున్న అనిల్

100 కోట్ల క్లబ్ లో 'అల వైకుంఠపురములో'
మెహరీన్.. సక్సెస్ ఫుల్ డబుల్ ధమాకా

పిల్లల కోసం మంచు లక్ష్మీ "చిట్టి చిలకమ్మ"
ఇప్పుడు సెలబ్రిటీస్ కూడా డిజిటల్ మీడియా ద్వారా అభిమానులకు మరింత దగ్గరగా వుండాలని చూస్తున్నారు. అందుకే తమ సొంత యూ ట్యూబ్ చానెల్స్ ను క్రియేట్ చేస్తూ.. తమ అప్ డేట్స్ ను రెగ్యులర్ గా ఇస్తున్నారు. ఇక ఈలిస్ట్ లో మంచు లక్ష్మి కూడా చేరిపోయింది. పిల్లల కోసం కొత్త యూ ట్యూబ్ ఛానల్ ను క్రియేట్ చేసింది మంచు లక్ష్మి. ఈ నేపథ్యంలో ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు మోహన్ బాబు.

'అల వైకుంఠపురములో' వైభవంగా విజయోత్సవ వేడుకలు
'అల... వైకుంఠపురంలో' చిత్రానికి ప్రేక్షకుల నుండి వస్తున్న రెస్పాన్స్ అత్యద్భుతంగా ఉంది. విడుదలైన అన్ని చోట్ల ఈ చిత్రం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ గా నమోదు చేసుకుంది.. గతానికి భిన్నంగా ఓవర్ సీస్ లో కూడా ఈ చిత్రం రికార్డు ఓపెనింగ్స్ దక్కించుకోవడం గమనార్హం. సినిమా ఇంతటి ఘన విజయం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ అభిమానుల సమక్షంలో బహిరంగంగా ఈ చిత్ర విజయోత్సవ సభ నిర్వహించబోతున్నారు.

ఎన్టీఆర్ ను మిస్ అవుతా..!
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 80 శాతం చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది.

సంక్రాంతి సినిమాల లేటెస్ట్ కలెక్షన్స్
సంక్రాంతి అన్ని సినిమాలు పండగ రోజుల్లో మంచి ఆక్యుపెన్సీ తో దూసుకు పోతున్నాయి, సంక్రాంతి సెలవు రోజున అన్ని సినిమాలు కలిపి రెండు తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ 24 కోట్లకి పైగా షేర్ ని సాధించాయి, ఇక ఇప్పుడు కనుమ హాలిడే రోజున ఈ సినిమాల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ముందుగా సంక్రాంతి ఫస్ట్ రిలీజ్ దర్బార్ ఈ రోజు మరో 40 లక్షల రేంజ్ లో షేర్ ని వసూల్ చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు.

'ఎవరు' డైరెక్టర్ తో 'దిల్ రాజు' ముల్టీస్టారర్..?
డిస్ట్రిబ్యూటర్ గా.. నిర్మాతగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎన్నో సక్సెస్ లను అందుకున్న సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. దిల్ రాజు ద్వారా సినిమా విడుదలైందంటే మినిమం గ్యారంటీ రిలీజ్ ఉంటుందన్న పేరు సంపాదించుకున్నాడు. ఇక కొత్త కొత్త డైరెక్టర్స్ ను సినీ ఇండస్ట్రీ కి పరిచయం చేయడం.. కొత్త వాళ్ళను ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు దిల్ రాజు. ఇక ఈ సంక్రాంతి కూడా దిల్ రాజు కు బాగా కలిసొచ్చింది. నిర్మాతగా 'సరిలేరు నీకెవ్వరు', డిస్ట్రిబ్యూటర్ గా 'అల వైకుంఠపురములో' సినిమాలు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. మరోసారి దిల్ రాజు కు సినిమాలపై వున్న పట్టు గురించి తెలిసింది. ప్రస్తుతం మరి కొన్ని సినిమాలు దిల్ రాజు…
దర్బార్ టార్గెట్ ఎంత..? వచ్చింది ఎంత..?
మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్, నయనతార ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా 'దర్బార్'. సంక్రాంతి పండుగ కానుకగా వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్సే రాబట్టింది. అయితే ఆ తర్వాత వచ్చిన రెండు పెద్ద సినిమాలు 'సరిలేరు నీకెవ్వరు', 'అల వైకుంఠపురములో' సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో దర్బార్ కలెక్షన్స్ కాస్త తగ్గాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 7 వ రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో 45 లక్షల రేంజ్ లో షేర్ ని రాబడుతుంది అనుకున్నా 59 లక్షల రేంజ్ లో షేర్ ని వసూల్ చేసి కొద్దిగా గ్రోత్ ని చూపింది. సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో మొదటి వారానికి గాను.. దర్బార్ ఏయే…
'ఆర్ఆర్ఆర్' - పోలీస్ ఆఫీసర్ పాత్రలో..?
బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 80 శాతం చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది.
విభిన్న విలన్ క్యారెక్టర్స్ కు సై - రవితేజ
తనదైన ప్రత్యేక స్టైల్ లో నటించి ప్రేక్షక అభిమానులను అలరించే మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు "డిస్కో రాజా" మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. ఎస్ ఆర్ టి క్రియేషన్స్ బ్యానర్ పై వి ఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందిన సైన్స్ ఫిక్షన్ మూవీ "డిస్కో రాజా" జనవరి 24 వ తేదీ రిలీజ్ కానుంది. నభా నటేష్, పాయల్ రాజ్ పుత్, తాన్యా హోప్ కథానాయికలు. థమన్ ఎస్ సంగీతం అందించారు.

"తలైవి" మూవీ లో ఎమ్ జి ఆర్
విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ నిర్మాణ సారథ్యంలో ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో లెజెండరీ యాక్ట్రెస్ , పొలిటికల్ లీడర్ జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా "తలైవి" తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. జయలలితగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ నటిస్తున్నారు. ఈ బయోపిక్ మూవీ లో మరొక ముఖ్యమైన క్యారెక్టర్ ఉంది. జయలలిత సినీ , పొలిటికల్ లైఫ్ లో మద్దతుగా నిలిచినలెజెండరీ యాక్టర్, తమిళనాడు ముఖ్యమంత్రి లేట్ ఎమ్ జి ఆర్. ఆ క్యారెక్టర్ కు ట్యాలెంటెడ్ యాక్టర్ అరవింద్ స్వామి ఎంపిక అయ్యారు.
రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రవితేజ?
మాస్ మహారాజా రవితేజ.. ప్రస్తుతం `డిస్కో రాజా`, `క్రాక్` చిత్రాలతో బిజీగా ఉన్నారు. `డిస్కో రాజా` ఈ నెల 24న రిలీజ్ కానుండగా.. `క్రాక్` వేసవిలో విడుదల కానుంది. ఈ లోపే మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
మెగాస్టార్ చిరంజీవి `ముఠామేస్త్రీ`కి 27 ఏళ్ళు
మెగాస్టార్ చిరంజీవికి అచ్చొచ్చిన దర్శకుల్లో ఎ. కోదండరామిరెడ్డి ఒకరు. వీరి కలయికలో వచ్చిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. అలాంటి ఈ కాంబినేషన్ లో వచ్చిన చివరి చిత్రం `ముఠామేస్త్రీ`. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో చిరుకి జోడీగా మీనా, రోజా నటించగా శరత్ సక్సేనా, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, అల్లు రామలింగయ్య, జేవీ సోమయాజులు ముఖ్య భూమికలు పోషించారు.
మహేష్ బాబు ఖాతాలో ఏడో చిత్రంగా `సరిలేరు నీకెవ్వరు`
సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఓవర్సీస్ లో ఎలాంటి ట్రాక్ రికార్డ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పలు `వన్ మిలియన్ డాలర్ క్లబ్` చిత్రాలతో `ఓవర్సీస్ కింగ్`గా పేరొందాడు మహేష్. అంతేకాదు.. `దూకుడు`తో `వన్ మిలియన్ డాలర్ క్లబ్`కి శ్రీకారం చుట్టిన ఈ సూపర్ స్టార్... ఆపై `బిజినెస్ మేన్` మినహా ప్రతి సినిమాతోనూ ఆ ఫీట్ ని రిపీట్ చేశాడు.
`కర్తవ్యం` దర్శకుడితో సమంత చిత్రం?
`యూటర్న్`, `ఓ బేబీ`.. ఇలా ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో ముందుకు సాగుతున్న టాలెంటెడ్ బ్యూటీ సమంత... మరో నాయికా ప్రాధాన్య చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాదు.. ఇందులో ఇదివరకెన్నడూ పోషించని ఓ వైవిధ్యభరితమైన పాత్రలో కనిపించనున్నట్టు తెలిసింది.
`పింక్` రీమేక్ రిలీజ్ డేట్ ఫిక్స్?
హిందీనాట ఘనవిజయం సాధించిన `పింక్`ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ-ఎంట్రీ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ ఎమోషనల్ కోర్ట్ డ్రామాని `ఎంసీఏ` ఫేమ్ వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేయనుండగా.. `దిల్` రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నివేదా థామస్, అంజలి, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి యువ సంగీత సంచలనం థమన్ బాణీలు అందిస్తున్నాడు.

చిరు టైటిల్స్ పై తమిళ్ హీరోల ఇంట్రెస్ట్..!
మొత్తానికి మన హీరోల కంటే తమిళ్ హీరోలు మాత్రం మెగాస్టార్ చిరంజీవి సినిమా టైటిల్స్ ను బాగానే వాడుకుంటున్నాట్టు కనిపిస్తుంది. నాని రీసెంట్ గా వచ్చిన సినిమాకు గ్యాంగ్ లీడర్ అని పెట్టగా దానిపై పెద్ద రచ్చనే జరిగింది. నానిమీద చిరు అభిమానులు మాములుగా కామెంట్స్ వేయలేదు. ఫైనల్ గా నాని 'గ్యాంగ్ లీడర్' ను కాస్త 'నానీస్ గ్యాంగ్ లీడర్' అని మార్చుకున్నాడు. కానీ తమిళ్ హీరోలకు మాత్రం ఆ బెడద లేకుండా పోయింది. కావాలని కథ ప్రకారం పెట్టుకుంటున్నారో..? లేక అలా కలిసొస్తుందో లేదో తెలియదు కానీ ఈ మధ్య కాలంలో చిరు టైటిల్స్ వాడకం మరీ ఎక్కువైంది.

'F3'ని లైన్ లో పెట్టనున్న అనిల్
మొత్తానికి గత ఏడాది పొంగల్ కి, ఈ ఏడాది పొంగల్ కి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి మంచి ఫామ్ లో వున్నాడు అనిల్ రావిపూడి. మొదటి నుండి కామెడీకి పెద్ద పీట వేసి సినిమాలు తెస్తుంటాడు అనిల్. అందుకే ఇప్పటివరకూ అతని కెరీర్ లో ప్లాప్స్ లేవు. ఏవరేజ్ లేకపోతే హిట్స్ నే దక్కించుకున్నాడు. గత సంక్రాంతి వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ లతో 'ఎఫ్2' ను తెరకెక్కించి సంక్రాంతికి రిలీజ్ చేయగా అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. రీసెంట్ గా మహేష్ బాబుతో 'సరిలేరు నీకెవ్వరు' చిత్రాన్ని తీసి.. హిట్ కొట్టి సంక్రాంతి సక్సెస్ ఖాతాలో వేసుకున్నాడు అనీల్.

'ఎంత మంచివాడవురా' ఫస్ట్ డే కలెక్షన్స్
కళ్యాణ్ రామ్, సతీష్ వేగేశ్న కాంబినేషన్ లో వచ్చిన కుటుంబ కథా చిత్రం ‘ఎంత మంచివాడవురా. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. మొదటి రోజు కొన్ని చోట్ల 'ఎంత మంచివాడవురా' సినిమాకి ఫరవాలేదనిపించే ఓపెనింగ్స్ వచ్చినా.. కొన్నిచోట్ల మాత్రం డీలా పడింది. దానికితోడు 'సరిలేరు నీకెవ్వరు', 'అల వైకుంఠపురములో' సినిమాలు కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద కొత్త రికార్డ్స్ సృష్టిస్తున్నాయి. ఇంత టఫ్ కాంపిటీషన్ లో ఈ సినిమా రావడం అంటే కొంచం రిస్క్ తో కూడిన విషయమే. మరి ఇంత పోటీని తట్టుకొని ఈ సినిమా మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం.
'దర్బార్' బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్
మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్, నయనతార ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా 'దర్బార్'. ఇక ఈసినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలిరోజు నుండే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. మొదటి నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్ అన్ని భాషల్లో 150 కోట్ల గ్రాస్ మార్క్ సాధించింది. తెలుగులో 'సరిలేరు నీకెవ్వరు', 'అల వైకుంఠపురములో' సినిమాలు రిలీజ్ అవ్వడంతో ఇక్కడ కాస్త కలెక్షన్స్ తగ్గాయని చెప్పొచ్చు. ఈ చిత్రం ఆంధ్ర - తెలంగాణలో 14.5 కోట్లకి అమ్ముడు పోయిన ఈ సినిమా మొదటి 5 రోజుల్లో దాదాపు 8 కోట్ల మార్క్ కి చేరువైంది. ఆరు రోజులకు గాను దర్బార్ 8.36 కోట్ల షేర్ వసూలు చేసింది.

100 కోట్ల క్లబ్ లో 'అల వైకుంఠపురములో'
త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'అల వైకుంఠపురములో' సినిమా జనవరి 12న రిలీజై ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. భారీ స్థాయిలో వసూళ్లు సాధిస్తోంది. సరిలేరు నీకెవ్వరు చిత్రాలతో పోటీ పడుతూ ఇప్పటికీ మంచి వసూళ్లు రాబడుతుంది. ఇక తాజాగా మరో రికార్డును క్రియేట్ చేసింది. తాజాగా ఈ చిత్రం రూ. 100 కోట్ల గ్రాస్ ను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.ఇక మొదటి రోజు దాదాపు 26 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం రెండో రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా ఉండి 10 కోట్ల మేర షేర్ సాధించింది. ఇక మూడోరోజు దాదాపు 11 కోట్లకు పైగా…
మెహరీన్.. సక్సెస్ ఫుల్ డబుల్ ధమాకా
2020 జనవరి 15.. పంజాబీ జాబిలి మెహరీన్ కెరీర్ లో వెరీ స్పెషల్ డే. ఎందుకంటే.. ఆ రోజు తను కథానాయికగా నటించిన రెండు వేర్వేరు భాషా చిత్రాలు సిల్వర్ స్క్రీన్ పై సందడి చేశాయి. ఆ చిత్రాలే.. `ఎంత మంచివాడవురా`, `పట్టాస్`. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన తెలుగు చిత్రం `ఎంత మంచివాడవురా`లోనూ.. కోలీవుడ్ స్టార్ ధనుష్ కథానాయకుడిగా నటించిన తమిళ చిత్రం `పట్టాస్`లోనూ అభినయానికి ప్రాధాన్యమున్న పాత్రల్లోనే కనిపించింది మెహరీన్. అంతేకాదు.. ఈ రెండు చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా.. విజయాలనూ ఒడిసిపట్టుకుంది. 2020ని రెండు సక్సెస్ ఫుల్ మూవీస్ తో షురూ చేసిన…