‘తలైవి’ నుండి రానున్న ‘ఎం.జి.ఆర్’ ఫస్ట్ లుక్

Arvind Swami MGR Look Out Tomorrow

ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్ ‘తలైవి’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జయలలిత పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగన రనౌత్ నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాలో ఎం.జి.రామచంద్రన్ మరియు కరుణానిధి పాత్రలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎం.జి.రామచంద్రన్ పాత్రలో అరవింద్‌ స్వామి నటించబోతుండగా..అదే విధంగా మరో కీలక పాత్ర మాజీ సీఎం కరుణానిధి పాత్రలో నటుడు ప్రకాష్ రాజ్ నటిస్తున్నసంగతి తెలిసిందే.

[custom_ad]

ఇదిలా ఉండగా తాజాగా ఓ అప్ డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. ఎం.జి.రామచంద్రన్ జయంతి సందర్భంగా రేపు ఈ సినిమాలో ఏం.జి .ఆర్ పాత్రలో నటిస్తున్న అరవింద్ స్వామి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

ఇంకా ఈ సినిమాలో జగపతి బాబు, జయసుధ, సత్యరాజ్ ముఖ్య పాత్రలలో నటించనున్నట్టు తెలుస్తుంది. విబ్రి మీడియా బ్యానర్ పై విష్ణు ఇందూరి నిర్మాణ సారథ్యం లో ఈ సినిమా రూపొందుతుంది. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ రైటర్ గా పనిచేస్తున్న ఈ మూవీ కి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను తమిళ్ తో పాటు తెలుగు , హిందీ భాషల్లో కూడా విడుదలకానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 18 =