పిల్లల కోసం మంచు లక్ష్మీ “చిట్టి చిలకమ్మ”

Manchu Lakshmi Comes Up With An Interesting News,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Manchu Lakshmi News,Latest News on Manchu Lakshmi,Manchu Lakshmi Talks About Web Series,Manchu Lakshmi Starts New Channel For Kids,Manchu Lakshmi Stars YouTube Channel For Kids

ఇప్పుడు సెలబ్రిటీస్ కూడా డిజిటల్ మీడియా ద్వారా అభిమానులకు మరింత దగ్గరగా వుండాలని చూస్తున్నారు. అందుకే తమ సొంత యూ ట్యూబ్ చానెల్స్ ను క్రియేట్ చేస్తూ.. తమ అప్ డేట్స్ ను రెగ్యులర్ గా ఇస్తున్నారు. ఇక ఈలిస్ట్ లో మంచు లక్ష్మి కూడా చేరిపోయింది. పిల్లల కోసం కొత్త యూ ట్యూబ్ ఛానల్ ను క్రియేట్ చేసింది మంచు లక్ష్మి. ఈ నేపథ్యంలో ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు మోహన్ బాబు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పిల్లలు దేవుడితో సమానం అంటారు. ఎదిగే కొద్దీ వారి మీద పరిసరాల ప్రభావం పడుతుంది. వాటిల్లో మంచి చెడు తెలుసుకోవాలంటే తల్లిదండ్రులు వారి పెంపకం మీద, ఉపాధ్యాయులు, వారి బోధన మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. వయసుతో పాటు పిల్లల ఆలోచనలు, ఆశయాలు, వ్యక్తిత్వం ఎదగాలి. అలా జరగాలి అంటే పిల్లలను తల్లిదండ్రులు ప్రశ్నించనివ్వాలి. ప్రతి ప్రశ్నకు మనం విసుక్కోకుండా సమాధానాలు ఇవ్వాలి. ఎప్పటికప్పుడు పిల్లలకు ఉండే ప్రతి చిన్న అనుమానాన్ని తొలగించాలి. ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుగుల జీవితంలో ఇలా చేయడం ఎంతమంది తల్లిదండ్రులకు సాధ్యమవుతుంది?

[custom_ad]

ఇదే ఆలోచన నా బిడ్డ లక్ష్మిప్రసన్నకి వచ్చి, తన బిడ్డ విద్యానిర్వాణ మరియు “చాయ్ బిస్కెట్” సంస్థతో కలిసి “చిట్టి చిలకమ్మ” పేరుతో ఒక YouTube Channel ప్రారంభిస్తున్నానని, పిల్లల పెంపకంలో ఉండే ఒక్కో సమస్యకు ఒక్కో episode చేస్తూ, పిల్లలకు వారి తల్లిదండ్రులకు ఉపయోగపడేలా ఆ Short Videos ఉంటాయని చెప్పినప్పుడు తనను కన్న తండ్రిగా గర్వపడ్డాను. ఆనందపడ్డాను. ప్రాధమిక జీవిత నైపుణ్యాలతో, తల్లిదండ్రులకు ఉపయుక్తమయ్యే చిట్కాలతో ప్రతీ శనివారం 6 PM కి ప్రసారమయ్యే ఈ Short Videos లో ప్రతీ వారం ఒక పిల్లల మానసిక వైద్యురాలు కూడా పాల్గొంటారు.

ఇవి ఆహ్లాదకరంగా, ఆమోదయోగ్యంగా, ఉపయోగపడేలా ఉండాలని, నా కుమార్తె లక్ష్మిప్రసన్న, నా ముద్దుల మనవరాలు విద్యానిర్వాణ, వారి బృందం చేసే ఈ ప్రయత్నం అద్భుత విజయం సాధించాలని ఆశీర్వదిస్తున్నాను.

[custom_ad]

– ఆశీఃపూర్వక అభినందనలతో
డా. మంచు మోహన్ బాబు

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − three =