డిస్ట్రిబ్యూటర్ గా.. నిర్మాతగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎన్నో సక్సెస్ లను అందుకున్న సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. దిల్ రాజు ద్వారా సినిమా విడుదలైందంటే మినిమం గ్యారంటీ రిలీజ్ ఉంటుందన్న పేరు సంపాదించుకున్నాడు. ఇక కొత్త కొత్త డైరెక్టర్స్ ను సినీ ఇండస్ట్రీ కి పరిచయం చేయడం.. కొత్త వాళ్ళను ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు దిల్ రాజు. ఇక ఈ సంక్రాంతి కూడా దిల్ రాజు కు బాగా కలిసొచ్చింది. నిర్మాతగా ‘సరిలేరు నీకెవ్వరు’, డిస్ట్రిబ్యూటర్ గా ‘అల వైకుంఠపురములో’ సినిమాలు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. మరోసారి దిల్ రాజు కు సినిమాలపై వున్న పట్టు గురించి తెలిసింది. ప్రస్తుతం మరి కొన్ని సినిమాలు దిల్ రాజు చేతిలో వున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. తాజాగా ఆయన మరో మల్టీస్టారర్ ను నిర్మించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ‘ఎవరు’ సినిమాతో హిట్ కొట్టిన వెంకట్ రాంజీ వినిపించిన కథ నచ్చడంతో, నిర్మాతగా ‘దిల్’ రాజు రంగంలోకి దిగుతున్నట్టుగా చెబుతున్నారు. అంతేకాదు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే.. ఈ మల్టీ స్టారర్లో ఒక మెగా హీరో కూడా నటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి. మరి చూద్దాం ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: