మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్, నయనతార ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘దర్బార్’. సంక్రాంతి పండుగ కానుకగా వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్సే రాబట్టింది. అయితే ఆ తర్వాత వచ్చిన రెండు పెద్ద సినిమాలు ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో దర్బార్ కలెక్షన్స్ కాస్త తగ్గాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 7 వ రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో 45 లక్షల రేంజ్ లో షేర్ ని రాబడుతుంది అనుకున్నా 59 లక్షల రేంజ్ లో షేర్ ని వసూల్ చేసి కొద్దిగా గ్రోత్ ని చూపింది. సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో మొదటి వారానికి గాను.. దర్బార్ ఏయే ఏరియాలో ఎంత కలెక్షన్ రాబట్టిందో చూద్దాం…
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
నైజాం – 4.51 కోట్లు
సీడెడ్ – 1.01 కోట్లు
యూఏ – 0.96 కోట్లు
ఈస్ట్ – 0.59 కోట్లు
వెస్ట్ – 0.40 కోట్లు
గుంటూరు – 0.65 కోట్లు
కృష్ణ – 0.48 కోట్లు
నెల్లూరు – 0.35 కోట్లు
ఏడురోజుల్లో ఏపీ+తెలంగాణ టోటల్ షేర్ – 8.95 కోట్లు (16.60 కోట్ల గ్రాస్)
ఇక ఈ సినిమాను తెలుగులో 14.2 కోట్లకు అమ్మగా సినిమా 15 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది, కాగా సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 6.05 కోట్ల షేర్ ని అందుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది. అంతేకాదు ఈ సినిమా మొదటి వారం తమిళ్ తో కలిపి టోటల్ వరల్డ్ వైడ్ గా 164 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని వసూల్ చేసిందని అంచనా వేస్తున్నారు. కాగా వరల్డ్ వైడ్ గా సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 280 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకోవాలి. అంటే రెండో వారం కూడా చాలా గట్టిగా హోల్డ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది…
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: