‘ఆర్ఆర్ఆర్’ – పోలీస్ ఆఫీసర్ పాత్రలో..?

Interesting News About Sudeep Role In RRR,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,RRR Movie Updates,RRR Telugu Movie Latest News,RRR Movie Latest Update,New Update From RRR Movie

బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 80 శాతం చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది.ఈ సినిమాలో సుదీప్ మరో కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సుదీప్ నటించనున్నాడట. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే. మరి గతంలో సుదీప్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ సినిమాలో విలన్ పాత్రలో నటించగా.. బాహుబలి సినిమాలో కూడా ఓ చిన్న పాత్రలో నటించాడు. ఇప్పుడు మరోసారి రాజమౌళి సినిమాలో కూడా అవకాశం దక్కడంతో సుదీప్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

[custom_ad]

కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. జులై 30, 2020 లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక ఒకటి కాదు రెండు కాదు ‘ఆర్ఆర్ఆర్’ ను ఏకంగా పది భాషల్లో రిలీజ్ చేయడానికి భారీ ప్లానే వేస్తున్నాడు రాజమౌళి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 12 =