చిరు టైటిల్స్ పై తమిళ్ హీరోల ఇంట్రెస్ట్..!

Tamil Heroes Showing Interest on Chiranjeevi Movie Titles,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Tamil Heroes Latest News,Tamil Heroes Showing Interest on Megastar Chiranjeevi Movie Titles

మొత్తానికి మన హీరోల కంటే తమిళ్ హీరోలు మాత్రం మెగాస్టార్ చిరంజీవి సినిమా టైటిల్స్ ను బాగానే వాడుకుంటున్నాట్టు కనిపిస్తుంది. నాని రీసెంట్ గా వచ్చిన సినిమాకు గ్యాంగ్ లీడర్ అని పెట్టగా దానిపై పెద్ద రచ్చనే జరిగింది. నానిమీద చిరు అభిమానులు మాములుగా కామెంట్స్ వేయలేదు. ఫైనల్ గా నాని ‘గ్యాంగ్ లీడర్’ ను కాస్త ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ అని మార్చుకున్నాడు. కానీ తమిళ్ హీరోలకు మాత్రం ఆ బెడద లేకుండా పోయింది. కావాలని కథ ప్రకారం పెట్టుకుంటున్నారో..? లేక అలా కలిసొస్తుందో లేదో తెలియదు కానీ ఈ మధ్య కాలంలో చిరు టైటిల్స్ వాడకం మరీ ఎక్కువైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ముందుగా విజయ ఆంటోనీ చిరు సినిమా టైటిల్స్ వాడటంలో మొదటి ప్లేస్ లో వున్నాడు. `న‌కిలీ`, `డా.స‌లీమ్‌`, `బిచ్చగాడు` చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన విజ‌య్ ఆంటోని త‌ర్వాత చేసిన చిత్రాల‌కు చిరంజీవి సినిమాలైన ఇంద్ర‌, రోష‌గాడు, జ్వాల‌ టైటిల్స్ పెట్టడం విశేషం.

[custom_ad]

ఇక కార్తీ కూడా చిరు టైటిల్స్ ను వాడాడు. లోకేష్ కనగరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన చిత్రాన్ని తెలుగులో `ఖైదీ` పేరుతో అనువాదం చేశాడు. ఈ సినిమా మంచి విజ‌యాన్ని ద‌క్కించుకుంది. జీతూ జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వంలో జ్యోతిక, కార్తీ అక్కాతమ్ముళ్లుగా నటించిన సినిమా ‘దొంగ’. ఇక ఈ సినిమా టైటిల్ కూడా చిరు సినిమా టైటిలే. కార్తీ ఇలా వరసగా చిరంజీవి టైటిల్స్ ను తన సినిమాలకు వాడుకోవడంపై మెగా ఫ్యాన్స్ అప్పట్లో కొంత అసహనానికి గురయ్యారు కూడా. అంతేకాదు ఈ విషయంపై కార్తీ కూడా క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. “ఖైదీ సినిమాకు అదే పెర్ఫెక్ట్ టైటిల్. తమిళంలో కూడా అదే టైటిల్ ఉంటుంది. అయితే అది చిరంజీవి గారి సినిమా టైటిల్ అని తెలియగానే చాలా సంతోషమేసింది. సినిమా చూసిన ఎవరైనా ఇదే కరెక్ట్ టైటిల్ అని అనుకుంటారు, అలాగే జరిగింది కూడా. ఇక దొంగ సినిమాకి వస్తే ముందుగా తమ్ముడు అనే టైటిల్ అనుకున్నాం కానీ అది అందుబాటులో లేదు, అందుకే దొంగ అనే టైటిల్ నిర్ణయించాం. ఇలా నా సినిమాలు చిరంజీవి గారి సినిమా టైటిల్స్ కు సరిపోవడం భలే అనిపిస్తోంది. ఆయన సినిమా టైటిల్స్ నా కథలకు సరిపోవడం గర్వంగా, గౌరవంగా ఫీల్ అవుతున్నా” అని చెప్పాడు.

[custom_ad]

ఇప్పుడు మరో తమిళ్ స్టార్ విజయ్ కూడా చిరు టైటిల్ ను వాడేసుకున్నాడు. ఇటీవలే ‘బిగిల్‌’తో తమిళ్‌లో అదిరిపోయే హిట్ ఇచ్చాడు. ఈ మూవీ తెలుగులో ‘విజిల్’గా రిలీజై యావరేజ్‌గా ఆడింది. విజ‌య్, లోకేష్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో 64వ సినిమా తెరకెక్కుతుంది. ఇక న్యూ ఇయర్ రోజున తన మూవీ ఫస్ట్‌లుక్, టైటిల్ రిలీజ్ చేసిన విజయ్ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చాడు. ఈ చిత్రానికి `మాస్ట‌ర్‌` అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.

వారి ఖాతాలో టాలెంటెడ్ హీరో ధనుష్ కూడా చేరిపోయాడు. ధ‌నుష్ త‌మిళంలో చేసిన ప‌టాస్ చిత్రాన్ని తెలుగులో రుస్తుం పేరుతో విడుద‌ల చేయ‌బోతున్నారు. మరి ఇంకా ఎంత మంది చిరు టైటిల్స్ ను వాడుకుంటారో చూద్దాం..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 2 =