ఎన్టీఆర్ ను మిస్ అవుతా..!

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 80 శాతం చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ మంచి ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ ఎనర్జీ లెవెల్స్ గురించి కూడా అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో తాజాగా రామ్ చరణ్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ప్రశంసలు కురిపించాడు. ఎన్టీఆర్ ఇక ఫైర్ క్రాక్ లాంటివాడు… ఎన్టీఆర్‌తో కలిసి వర్క్ చేయడం అంటే తనకెంతో ఇష్టమంటున్న చరణ్ షూటింగ్లో ఎన్టీఆర్ ఉంటే చాలా సందడిగా ఉంటుందని, ఒకవేళ తారక్ షూటింగ్లో లేకపోతే అతన్ని మిస్సవుతానని అన్నారు. అంతేకాదు ఎన్టీఆర్, తాను చాలా కాలం నుండి స్నేహితులం కావడం వలన చాలా సులభంగా షూటింగ్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. మరి ఒక స్టార్ హీరో ఉంటేనే స్క్రీన్ మీద ఎంతో సందడిగా ఉంటుంది.. అలాంటిది ఇద్దరు స్టార్ హీరోలు.. అందులో ఎన్టీఆర్, చరణ్.. ఆ సందడి ఎలా ఉంటుందో చూడాలంటే సినిమా వచ్చేంత వరకూ ఆగాల్సిందే..

[custom_ad]

కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. జులై 30, 2020 లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక ఒకటి కాదు రెండు కాదు ‘ఆర్ఆర్ఆర్’ ను ఏకంగా పది భాషల్లో రిలీజ్ చేయడానికి భారీ ప్లానే వేస్తున్నాడు రాజమౌళి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − five =