మొత్తానికి గత ఏడాది పొంగల్ కి, ఈ ఏడాది పొంగల్ కి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి మంచి ఫామ్ లో వున్నాడు అనిల్ రావిపూడి. మొదటి నుండి కామెడీకి పెద్ద పీట వేసి సినిమాలు తెస్తుంటాడు అనిల్. అందుకే ఇప్పటివరకూ అతని కెరీర్ లో ప్లాప్స్ లేవు. ఏవరేజ్ లేకపోతే హిట్స్ నే దక్కించుకున్నాడు. గత సంక్రాంతి వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ లతో ‘ఎఫ్2’ ను తెరకెక్కించి సంక్రాంతికి రిలీజ్ చేయగా అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. రీసెంట్ గా మహేష్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని తీసి.. హిట్ కొట్టి సంక్రాంతి సక్సెస్ ఖాతాలో వేసుకున్నాడు అనీల్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఇదిలా ఉండగా తాజాగా అనిల్ తర్వాత ప్రాజెక్ట్ పై కూడా క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. సినిమాపై ‘ఎఫ్ 2’కి సీక్వెల్ లాంటి ‘ఎఫ్ 3’పై గురించి చెప్పాడు అనిల్. ఎఫ్ 3, ఎఫ్ 2 కు సీక్వెల్ కాదని, కథలో కంటిన్యూ అవ్వడం ఏం ఉండదని, ఎఫ్ 3 అంతా కొత్త ప్రపంచంలో ఉంటుందని.. ఎఫ్ 2కి ఎఫ్ 3కి అసలు సంబంధం ఉండదని చెప్పాడు. అలాగే ఇందులో హీరో, హీరోయిన్లు నలుగురు కంటిన్యూ అవుతారని రివీల్ చేసాడు. అలాగే రాజేంద్ర ప్రసాద్ పాత్ర కూడా ఉంటుందని, తను లేకుండా సినిమా చేయలేనని అన్నాడు అనిల్ రావిపూడి. మొదటి సినిమా పెళ్లి, ఫ్రస్ట్రేషన్ మీద ఉంటే ఎఫ్ 3 లో కెరీర్, గోల్స్ గురించి ఉంటుందని రివీల్ చేసాడు. ఎఫ్ 3 అంటే ఫన్, ఫ్రస్ట్రేషన్ అండ్ మోర్ ఫన్ అని చెప్పాడు అనిల్ రావిపూడి.చూద్దాం మరి ఎఫ్3 తో అనిల్ ఇంకెంత కామెడీ తో నవ్విస్తాడో..
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: