
ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 186


వడ్డే నవీన్ కుమారుడి పంచ కట్టు వేడుక

ఇక సెలవు అంటూ విజయశాంతి ట్వీట్

"తలైవి" మూవీ రిలీజ్ డేట్

చిరు సినిమాలో విలన్ గా..?

"సవారి" మూవీ టీమ్ కు బ్రియాన్ లారా శుభాకాంక్షలు

రామ్ గోపాల్ వర్మ "దిశ"

హీరో నిఖిల్ "పెళ్ళి సందడి"

మెగాస్టార్ 152.. యాక్షన్ టైమ్
`మహేష్ బాబు 27`కి రిలీజ్ డేట్ ఫిక్సయిందా?

`జెర్సీ` దర్శకుడితో రామ్ చరణ్ చిత్రం?

`మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్`గా అఖిల్?

"క్రాక్" మూవీ షూటింగ్ అప్ డేట్

"ఓ .. పిట్టకథ" మూవీ ప్రీ టీజర్ రిలీజ్

"శ్రీకారం "మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో #PSPK28

పవన్ 'పింక్' రీమేక్ రిలీజ్ డేట్ ఫిక్స్ - త్వరలో టైటిల్ ప్రకటన..!
జనసేన పార్టీ పెట్టి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్ళిపోయి ఫుల్ టైం పొలిటికల్ లీడర్‌గా మారిపోయాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆ తర్వాత తన సినిమా జీవితానికి కూడా స్వస్తి చెప్పాడు. కానీ ఇప్పుడు యూటర్న్ తీసుకొని మళ్ళీ సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

వడ్డే నవీన్ కుమారుడి పంచ కట్టు వేడుక
ప్రముఖ హీరో వడ్డే నవీన్ కుమారుడు వడ్డే జిష్ణు పంచకట్టు వేడుక ఇటీవల హైదరాబాద్ మాదాపూర్ లోని ఆవాస హోటల్ లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై చిరంజీవి జిష్ణుకు శుభాశీస్సులు అందజేశారు.

ఇక సెలవు అంటూ విజయశాంతి ట్వీట్
13 సంవత్సరాల తరువాత లేడీ అమితాబ్ విజయశాంతి బ్లాక్ బస్టర్ మూవీ "సరిలేరు నీకెవ్వరు" తో టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ లో విజయశాంతి ప్రొఫెసర్ భారతి గా అద్భుతంగా నటించి ప్రేక్షక, అభిమానుల ప్రశంసలు పొందారు. "సరిలేరు నీకెవ్వరు" మూవీ పై తన స్పందనను ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ, ఇక సెలవు అంటూ విజయశాంతి ట్వీట్ చేసి ప్రేక్షక, అభిమానులకు షాక్ ఇచ్చారు.

"తలైవి" మూవీ రిలీజ్ డేట్
స్టార్ హీరోయిన్, పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ గా చరిత్ర సృష్టించిన తమిళనాడు దివంగత ముఖ్య మంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో "తలైవి " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. జయలలిత సినీ, రాజకీయ జీవితం లో జరిగిన ముఖ్య సంఘటనలతో రూపొందుతున్న "తలైవి " మూవీ లో జయలలిత గా బ్లాక్ బస్టర్ "మణికర్ణిక" మూవీ ఫేమ్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ నటిస్తున్నారు.

చిరు సినిమాలో విలన్ గా..?
మరి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి ప్రధాన పాత్రలో స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన 'సైరా' సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెంటనే మరో సినిమాను లైన్ లో పెట్టేసాడు చిరు.

"సవారి" మూవీ టీమ్ కు బ్రియాన్ లారా శుభాకాంక్షలు
నందు, ప్రియాంక శర్మ జంటగా సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ "సవారి" మూవీ 7వ తేదీ రిలీజ్ కానుంది. కాల్వ నరసింహ స్వామి ప్రొడక్షన్స్ , నిషాంక్ &సంతోష్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై రూపొందిన "సవారి" మూవీకి శేఖర్ చంద్ర సంగీతం అందించారు. ఈ మూవీ కి సంతోష్ మోత్కూరి, నిషాంక్ రెడ్డి నిర్మాతలు.

రామ్ గోపాల్ వర్మ "దిశ"
నిజ జీవిత కథలతో "వీరప్పన్ ", "రక్త చరిత్ర", "లక్ష్మీస్ NTR", "అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు" వంటి వివాదాస్పద మూవీస్ రూపొందించిన సంచలన దర్శకుడు రామ్ గోపాల వర్మ ఇప్పుడు ఒక డిఫరెంట్ స్టోరీ తో ఒక చిత్రాన్ని రూపొందించనున్నారు. పసికందులని చూడకుండా మహిళల పై అత్యాచారం, హత్యచారాలు జరుగుతున్న విషయం తెలిసిందే.

హీరో నిఖిల్ "పెళ్ళి సందడి"
"హైదరాబాద్ నవాబ్స్ " మూవీ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన నిఖిల్ సక్సెస్ ఫుల్ "హ్యాపీ డేస్" మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. నిఖిల్ హీరోగా నటించిన "స్వామి రా రా", "కార్తికేయ", "ఎక్కడికి పోతావు చిన్నవాడా", "అర్జున్ సురవరం" మూవీస్ ఘనవిజయం సాధించాయి. నిఖిల్ ప్రస్తుతం సూపర్ హిట్ మూవీ "కార్తికేయ" కు సీక్వెల్ గా రూపొందనున్న "కార్తికేయ 2" మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మెగాస్టార్ 152.. యాక్షన్ టైమ్
`ఖైదీ నంబర్ 150`, `సైరా నరసింహారెడ్డి`.. ఇలా రీ-ఎంట్రీలో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం ఈ సీనియర్ హీరో... సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తన 152వ చిత్రాన్ని చేస్తున్నారు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కలసి నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి మెలోడీ బ్రహ్మ మణిశర్మ బాణీలు అందిస్తున్నాడు. త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో రెజీనా ఓ ప్రత్యేక గీతంలో సందడి చేస్తోందని సమాచారం.

మరోమారు.. పవన్ కళ్యాణ్, దేవిశ్రీ ప్రసాద్ కాంబో?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అచ్చొచ్చిన స్వరకర్తల్లో యువ సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ ఒకరు. వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి మూడు చిత్రాలు `జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది` సంచలన విజయం సాధించాయి. నాలుగో సినిమాగా వచ్చిన `సర్దార్ గబ్బర్ సింగ్` ఆశించిన విజయం సాధించకపోయినా.. దేవిశ్రీ బాణీలు అలరించాయి.
`మహేష్ బాబు 27`కి రిలీజ్ డేట్ ఫిక్సయిందా?
`భరత్ అనే నేను`, `మహర్షి`, `సరిలేరు నీకెవ్వరు`.. ఇలా వరుస విజయాలతో ముందుకు సాగుతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. కాగా, తన తదుపరి చిత్రాన్ని `మహర్షి` దర్శకుడు వంశీ పైడిపల్లితో చేయబోతున్నాడు మహేష్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. వేసవిలో పట్టాలెక్కనుంది. ప్రముఖ నిర్మాత `దిల్` రాజు ఈ సినిమాని నిర్మిస్తారని టాక్. అలాగే `భరత్ అనే నేను` తరువాత బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని మరోమారు మహేష్ తో జట్టుకట్టబోతోందని వినికిడి. థమన్ స్వరాలు అందించనున్నాడు.

`జెర్సీ` దర్శకుడితో రామ్ చరణ్ చిత్రం?
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బడా మల్టీస్టారర్ `ఆర్ ఆర్ ఆర్`తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ రాజమౌళి రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. కాగా, ఏప్రిల్ లేదా మే నాటికి చరణ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పార్ట్ కంప్లీట్ అవుతుందని సమాచారం. ఈ నేపథ్యంలో.. చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. `మళ్ళీ రావా`, `జెర్సీ` చిత్రాల దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో చెర్రీ తదుపరి సినిమా ఉంటుందని తెలిసింది. ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మిస్తారని ప్రచారం…

`మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్`గా అఖిల్?
`అఖిల్, హలో, మిస్టర్ మజ్ను` చిత్రాలతో అలరించిన యువ కథానాయకుడు అఖిల్ అక్కినేని.. ప్రస్తుతం ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే. `బొమ్మరిల్లు` భాస్కర్ రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. `సిసింద్రీ`లో చిన్నారి అఖిల్ కి అమ్మగా నటించిన ఆమని.. పాతికేళ్ళ తరువాత మళ్ళీ ఇందులో తల్లిగా కనిపించనుంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, వాసువర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఫిబ్రవరి 7వ తేదీ విడుదలకు సిద్ధమైన 4 చిత్రాలు
డిఫరెంట్ జానర్ లలో రూపొందిన 4 సినిమాలు ఫిబ్రవరి 7వ తేదీ రిలీజ్ కు సిద్ధం అయ్యాయి. ఇప్పుడు ఆ 4 సినిమాల గురించి తెలుసుకుందాం. రిలీజ్ కు పోటీ పడుతున్న ఈ నాలుగు మూవీస్ లో ఏ మూవీ విజయం సాధిస్తుందో వేచి చూడాల్సిందే.

"క్రాక్" మూవీ షూటింగ్ అప్ డేట్
సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " మూవీ శరవేగంగా తెరకెక్కుతుంది. శృతి హాసన్ కథానాయిక కాగా వరలక్ష్మి శరత్ కుమార్, సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న "క్రాక్" మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

"ఓ .. పిట్టకథ" మూవీ ప్రీ టీజర్ రిలీజ్
భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై చందు ముద్దు దర్శకత్వంలో విశ్వంత్, నిత్య శెట్టి జంటగా యూత్ ఫుల్ లవ్ స్టోరీ ఇట్స్ ఏ లాంగ్ స్టోరీ ట్యాగ్ లైన్ తో "ఓ .. పిట్టకథ" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. సంజయ్ రావు, బ్రహ్మాజీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు.

"శ్రీకారం "మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై కిషోర్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "శ్రీకారం "మూవీ ఏప్రిల్ 24వ తేదీ రిలీజ్ కానుంది. పల్లెటూరి యువకుడు గా శర్వానంద్ నటిస్తున్న ఈ మూవీ లో "గ్యాంగ్ లీడర్" మూవీ ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక.

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో #PSPK28
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ కామెడీ మూవీ "గబ్బర్ సింగ్" 2012 వ సంవత్సరంలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. "గబ్బర్ సింగ్" మూవీ లో తన పెర్ఫార్మెన్స్ కు పవన్ కళ్యాణ్ బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. దాదాపు 8సంవత్సరాల తరువాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో #PSPK28 మూవీ రూపొందనుంది.
త్వరలో "సోలో బ్రతుకే సో బెటర్" మూవీ థీమ్ వీడియో రిలీజ్
సక్సెస్ ఫుల్ "చిత్రలహరి" మూవీ తరువాత హీరో సాయి ధరమ్ తేజ్ విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకుంటున్నారు. సాయి ధరమ్ తేజ్ హీరో గా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "ప్రతి రోజూ పండగే " మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు "సోలో బ్రతుకే సో బెటర్" అంటూ మరొక మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.
"భాగమతి" రీమేక్ "దుర్గావతి" లో అక్షయ్ కుమార్ గెస్ట్ రోల్
స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన హారర్ థ్రిల్లర్ "భాగమతి" మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు "భాగమతి" మూవీ హిందీలో "దుర్గావతి" గా రీమేక్ అవుతుంది. అబుదాంటియా ఎంటర్ టైన్ మెంట్ , టి - సిరీస్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై జి. అశోక్ దర్శకత్వంలో భూమి పెడ్నేకర్ ప్రధానపాత్రలో "దుర్గావతి" మూవీ రూపొందుతుంది. శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందిస్తున్నారు.