14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై కిషోర్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “శ్రీకారం “మూవీ ఏప్రిల్ 24వ తేదీ రిలీజ్ కానుంది. పల్లెటూరి యువకుడు గా శర్వానంద్ నటిస్తున్న ఈ మూవీ లో “గ్యాంగ్ లీడర్” మూవీ ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న “శ్రీకారం “మూవీకి మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. “శ్రీకారం “మూవీ లోని శర్వానంద్ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను ఈ రోజు చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. శర్వానంద్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన రొమాంటిక్ డ్రామా “జాను”మూవీ ఫిబ్రవరి 7వ తేదీ రిలీజ్ కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: