పవన్ ‘పింక్’ రీమేక్ రిలీజ్ డేట్ ఫిక్స్ – త్వరలో టైటిల్ ప్రకటన..!

Latest Telugu Movies News, Pawan Kalyan, Pawan Kalyan Pink Movie Remake To Release On This Special Date, Pink Movie Remake, Pink Movie Remake Release Date, Pink Movie Remake Release Date Confirmed, Pink Movie Remake Release Date Fixed, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

జనసేన పార్టీ పెట్టి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్ళిపోయి ఫుల్ టైం పొలిటికల్ లీడర్‌గా మారిపోయాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆ తర్వాత తన సినిమా జీవితానికి కూడా స్వస్తి చెప్పాడు. కానీ ఇప్పుడు యూటర్న్ తీసుకొని మళ్ళీ సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం వేణు శ్రీ‌రామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెలుగులో పింక్ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నసంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు మొదటినుండి వార్తలు వచ్చిన సంగతి విదితమే. ఇక ఈ సినిమా షూటింగ్ అలా మొదలైందో లేదో అప్పుడే రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ ఇచ్చేసారు. ఈ సినిమాను మే 15వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. అంతేకాదు ఈ సినిమా టైటిల్ రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ ఇచ్చారు దిల్ రాజు. ఉగాది రోజున ఈ సినిమా టైటిల్ ను ప్రకటించనున్నారు.

[custom_ad]

ఇక ఈ సినిమాలో నివేదా థామస్ ఒక కీలక పాత్రలో నటిస్తుండగా.. దిల్ రాజు, బోని కపూర్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

కాగా అమితాబ్‌, తాప్సీ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన బాలీవుడ్ హిట్ చిత్రం ‘పింక్’ ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇదే సినిమాను త‌మిళంలో ‘నెర్కొండ పార్వాయి’ అనే టైటిల్‌తో.. అజిత్ ప్ర‌ధాన పాత్ర‌లో తమిళ్ లో రీమేక్ చేయగా అక్కడ కూడా హిట్ కొట్టింది. మరి తెలుగులో ఎంత వరకూ హిట్ కొడుతుందో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × one =