`అఖిల్, హలో, మిస్టర్ మజ్ను` చిత్రాలతో అలరించిన యువ కథానాయకుడు అఖిల్ అక్కినేని.. ప్రస్తుతం ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే. `బొమ్మరిల్లు` భాస్కర్ రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. `సిసింద్రీ`లో చిన్నారి అఖిల్ కి అమ్మగా నటించిన ఆమని.. పాతికేళ్ళ తరువాత మళ్ళీ ఇందులో తల్లిగా కనిపించనుంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, వాసువర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి కథానుసారం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్` అనే టైటిల్ ని ఫిక్స్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, మంగళవారం (ఫిబ్రవరి 4) సాయంత్రం చిత్ర యూనిట్… అధికారికంగా ప్రకటించే టైటిల్ ఇదేనని జోరుగా ప్రచారం సాగుతోంది. మరి.. `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్`గా అఖిల్ ఏ స్థాయిలో ఎంటర్ టైన్ చేస్తాడో తెలియాలంటే వేసవి వరకు వేచిచూడాల్సిందే.
`అఖిల్ 4`కి గోపీ సుందర్ సంగీతమందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: