స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన హారర్ థ్రిల్లర్ “భాగమతి” మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు “భాగమతి” మూవీ హిందీలో “దుర్గావతి” గా రీమేక్ అవుతుంది. అబుదాంటియా ఎంటర్ టైన్ మెంట్ , టి – సిరీస్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై జి. అశోక్ దర్శకత్వంలో భూమి పెడ్నేకర్ ప్రధానపాత్రలో “దుర్గావతి” మూవీ రూపొందుతుంది. శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ప్రముఖ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ యశ్ రాజ్ ఫిల్మ్స్ లో అసిస్టెంట్ కాస్టింగ్ డైరెక్టర్ గా 6 సంవత్సరాలు పనిచేసిన భూమి పెడ్నేకర్ , సూపర్ హిట్ మూవీ “దమ్ లగాకే హైసా ” మూవీ తో బాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అయ్యారు. భూమి నటించిన టాయిలెట్ :ఏక్ ప్రేమ్ కథ, శుభ్ మంగళ్ సావధాన్, బాల, పతి పత్ని ఔర్ వో మూవీస్ ఘనవిజయం సాధించాయి. భూమి బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా
రాణిస్తున్నారు. ఇక బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ “దుర్గావతి” మూవీ లో అతిథి పాత్రలో నటిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: