రామ్ గోపాల్ వర్మ “దిశ”

RGV New Movie On Disha Case

నిజ జీవిత కథలతో “వీరప్పన్ “, “రక్త చరిత్ర”, “లక్ష్మీస్ NTR”, “అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు” వంటి వివాదాస్పద మూవీస్ రూపొందించిన సంచలన దర్శకుడు రామ్ గోపాల వర్మ ఇప్పుడు ఒక డిఫరెంట్ స్టోరీ తో ఒక చిత్రాన్ని రూపొందించనున్నారు. పసికందులని చూడకుండా మహిళల పై అత్యాచారం, హత్యచారాలు జరుగుతున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

“నిర్భయ”, “దిశ” వంటి వాస్తవ సంఘటనలతో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో “దిశ” మూవీ రూపొందనుంది. హైదరాబాద్ లో “దిశ” పై నలుగురు దుండగులు జరిపిన హత్యాచార ఘటన ప్రజల మనసులను కలిచివేసింది. కోర్టులు, కేసులు, సాక్ష్యాలు అంటూ జాప్యం లేకుండా పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. ఎన్ కౌంటర్ లో ఆ నిందితులు హతమవడంతో, సత్వర న్యాయం జరిగిందని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. వివాదాస్పద చిత్ర దర్శకుడిగా పేరొందిన వర్మ ఎటువంటి కమర్షియల్ హంగులు లేకుండా ” దిశ” మూవీ తో ప్రజలను ఎడ్యుకేట్ చేయాలనుకొనడం వర్మను అభినందించదగ్గ విషయమే . “దిశ” మూవీ తో మృగాళ్ళకు కనువిప్పు కలుగుతుందని, పెను మార్పు వస్తుందని ఆశిద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + thirteen =