“తలైవి” మూవీ రిలీజ్ డేట్

Thalaivi Movie Gets Final Release Date

స్టార్ హీరోయిన్, పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ గా చరిత్ర సృష్టించిన తమిళనాడు దివంగత ముఖ్య మంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో “తలైవి ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. జయలలిత సినీ, రాజకీయ జీవితం లో జరిగిన ముఖ్య సంఘటనలతో రూపొందుతున్న “తలైవి ” మూవీ లో జయలలిత గా బ్లాక్ బస్టర్ “మణికర్ణిక” మూవీ ఫేమ్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ నిర్మిస్తున్న “తలైవి ” మూవీ లో లెజెండరీ యాక్టర్, తమిళనాడు దివంగత ముఖ్య మంత్రి ఎమ్ జి ఆర్ పాత్రలో అరవింద్ స్వామి, కరుణానిధి పాత్రలో ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. “తలైవి ” మూవీ తమిళ భాష తో పాటు తెలుగు , హిందీ భాషలలో జూన్ 26 వ తేదీ రిలీజ్ కానుందని నిర్మాతలు ప్రకటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన కంగనా రనౌత్ ఫస్ట్ లుక్, టీజర్ ,ఎమ్ జి ఆర్ పాత్రలో నటిస్తున్న అరవింద్ స్వామి ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. జయలలిత బయోపిక్ మూవీ “తలైవి ” కై అన్ని భాషల ప్రేక్షకులు ఆసక్తి తో ఎదురుచూస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 8 =