ఇక సెలవు అంటూ విజయశాంతి ట్వీట్

Vijayashanthi Bids Goodbye To Telugu Movies

13 సంవత్సరాల తరువాత లేడీ అమితాబ్ విజయశాంతి బ్లాక్ బస్టర్ మూవీ “సరిలేరు నీకెవ్వరు” తో టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ లో విజయశాంతి ప్రొఫెసర్ భారతి గా అద్భుతంగా నటించి ప్రేక్షక, అభిమానుల ప్రశంసలు పొందారు. “సరిలేరు నీకెవ్వరు” మూవీ పై తన స్పందనను ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ, ఇక సెలవు అంటూ విజయశాంతి ట్వీట్ చేసి ప్రేక్షక, అభిమానులకు షాక్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

“సరిలేరు నీకెవ్వరు” మూవీతో ఇంత గొప్ప విజయాన్ని తనకు అందించిన, తనను ఎల్లప్పుడూ ఆదరిస్తున్న ప్రేక్షకాభిమానులను మనస్ఫూర్తిగా ధన్యవాదాలని, తన నట ప్రస్థానం 1979 సంవత్సరం నుండి 2020 సంవత్సరం వరకు అని, ఇన్ని సంవత్సరాల పాటు తనను ఆదరించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు ప్రజా జీవన పోరాటంలో తన ప్రయాణం అని, మళ్ళీ మరో సినిమాలో నటించే సందర్భం ఉంటుందో, లేదో అని తెలియదని, ఇప్పటికి ఇక సెలవు అని, మీ ఆదరణకు, తన ప్రాణ ప్రదమైన అభిమాన సైన్యానికి ఎప్పటికీ నమస్సులని, సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు, అనిల్ రావిపూడి గారికి కృతజ్ఞతలని విజయశాంతి ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.