`భరత్ అనే నేను`, `మహర్షి`, `సరిలేరు నీకెవ్వరు`.. ఇలా వరుస విజయాలతో ముందుకు సాగుతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. కాగా, తన తదుపరి చిత్రాన్ని `మహర్షి` దర్శకుడు వంశీ పైడిపల్లితో చేయబోతున్నాడు మహేష్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. వేసవిలో పట్టాలెక్కనుంది. ప్రముఖ నిర్మాత `దిల్` రాజు ఈ సినిమాని నిర్మిస్తారని టాక్. అలాగే `భరత్ అనే నేను` తరువాత బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని మరోమారు మహేష్ తో జట్టుకట్టబోతోందని వినికిడి. థమన్ స్వరాలు అందించనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ మేలో ప్రారంభం కానుందని సమాచారం. ఆపై చకచకా చిత్రీకరణ జరిపి.. 2021 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్లానింగ్ జరుగుతోందట. అంతేకాదు.. రిలీజ్ డేట్ గా జనవరి 13ని ఫిక్స్ చేశారని ప్రచారం సాగుతోంది. మరి.. `సరిలేరు నీకెవ్వరు` తరువాత సంక్రాంతి బరిలో దిగుతున్న మహేష్.. నెక్స్ట్ మూవీతోనూ సెన్సేషన్ క్రియేట్ చేస్తాడేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: