కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 172

సినిమా వార్తలు

"ఉప్పెన " మూవీ టీమ్ కు ఆల్ ది బెస్ట్

మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న "ఉప్పెన"మూవీ ఏప్రిల్ 2వ తేదీ రిలీజ్ కానుంది. "ఉప్పెన " మూవీ తో హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరో గా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. కృతి శెట్టి కథానాయిక కాగా తమిళ హీరో విజయ్ సేతుపతి ప్రతి నాయకుడిగా నటించడం విశేషం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

భారీ పౌరాణిక చిత్రం లో మంచు విష్ణు

శివరాత్రి పర్వదిన సందర్భంగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒక భారీ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసారు. 60 కోట్ల భారీ బడ్జెట్ తో మంచు విష్ణు హీరోగా పౌరాణిక చిత్రం "భక్త కన్నప్ప " ను రూపొందించనున్నట్టు మోహన్ బాబు వెల్లడించారు. నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.

Team TFNవాట్సాప్
సాంగ్

ఒరేయ్ బుజ్జిగా 'కురిసెన.. కురిసెన' పాట రిలీజ్

విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా 'ఒరేయ్‌.. బుజ్జిగా' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 25 వ తేదీ రిలీజ్ కానున్న నేపథ్యంలో... ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టారు. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయగా.. ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి మొదటి పాటను రిలీజ్ చేశారు. ‘కురిసెన.. కురిసెన.. తొలకరి వలపులె మనసున, మురిసెన.. మురిసెన.. కలలకి కనులకి కలిసెన..’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్‌ను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ విడుదల చేశారు. ఈ పాటకు కె.కె. సాహిత్యం…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

`ఎఫ్ 3` సెకండాఫ్ లో మ‌హేష్ సంద‌డి?

గ‌త ఏడాది సంక్రాంతికి వ‌చ్చిన హిలేరియ‌స్ ఎంట‌ర్ టైన‌ర్ `ఎఫ్ 2`... ఏ స్థాయిలో పెర్ ఫార్మ్ చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. విక్ట‌రీ వెంక‌టేష్, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా, స్ట‌న్నింగ్ బ్యూటీ మెహ‌రీన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి రూపొందించిన ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీకి... త్వ‌ర‌లో సీక్వెల్ రానుంది. దాదాపుగా`ఎఫ్ 2`లో న‌టించిన వాళ్ళంద‌రూ... `ఎఫ్ 3`లోనూ కొన‌సాగే అవ‌కాశ‌ముంద‌ని ప్ర‌చారం సాగుతోంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

`రెడ్`కి మ‌ణిశ‌ర్మ సెంటిమెంట్

`ఇస్మార్ట్ శంకర్`తో `ఇస్మార్ట్`గా బౌన్స్ బ్యాక్ అయ్యాడు మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ‌. ప్ర‌స్తుతం `మెగాస్టార్ 152`తో పాటు `నార‌ప్ప‌`, `రెడ్`... ఇలా ప‌లు క్రేజీ ప్రాజెక్ట్ ల‌కు బాణీలు అందిస్తున్నాడీ వెట‌ర‌న్ కంపోజ‌ర్. కాగా, వీటిలో `రెడ్` ముందుగా రిలీజ్ కానుంది. దాదాపు చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్.. ఏప్రిల్ 9న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

`నార‌ప్ప‌`.. మార్చి నెలాఖరు క‌ల్లా షూటింగ్ పూర్తి?

`ఎఫ్ 2`, `వెంకి మామ‌`... ఇలా వ‌రుస విజ‌యాల‌తో ముందుకు సాగుతున్నారు సీనియ‌ర్ హీరో వెంక‌టేష్. ప్ర‌స్తుతం ఈ ద‌గ్గుబాటి స్టార్ త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ `అసుర‌న్` ఆధారంగా రూపొందుతున్న `నార‌ప్ప‌`లో న‌టిస్తున్నారు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో వెంకీకి జోడీగా ప్రియ‌మ‌ణి, అమ‌లా పాల్ న‌టిస్తుండగా.. శ్రీ‌కాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

న్యూ లుక్ లో అజిత్

సక్సెస్ ఫుల్ చిత్ర కథానాయకుడు గా కోలీవుడ్ లో రాణిస్తున్న సూపర్ స్టార్ అజిత్ ప్రస్తుతం హెచ్. వినోత్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ "వాలిమై " మూవీ లో నటిస్తున్నారు. "వాలిమై " మూవీ లో బైక్ ఛేజింగ్ సీన్ చిత్రీకరణ సమయంలో అజిత్ గాయపడిన విషయం తెలిసిందే. చిన్న చిన్న గాయాలతో బయట పడిన అజిత్ కొన్ని రోజులు షూటింగ్ కు విరామం ఇచ్చారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ర‌ష్మిక‌... ద‌ ఫెస్టివ‌ల్ క్వీన్

`ఛ‌లో`(2018)తో తెలుగు తెర‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది క‌న్న‌డ క‌స్తూరి ర‌ష్మిక మంద‌న్న‌. మొద‌టి సినిమాతోనే ఘ‌న‌విజ‌యాన్ని అందుకున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ.. రెండో చిత్రం `గీత గోవిందం`తో ఏకంగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ త‌రువాత వ‌చ్చిన `దేవ‌దాస్`, `డియ‌ర్ కామ్రేడ్` నిరాశ‌ప‌రిచినా... 2020లో వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతోంది ర‌ష్మిక‌.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

య‌న్టీఆర్ 30.. కీల‌క పాత్ర‌లో స‌మంత‌?

యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్, ఏస్ ఫిల్మ్ మేక‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్... మ‌రోసారి జ‌ట్టుక‌డుతున్న సంగ‌తి తెలిసిందే. `అర‌వింద స‌మేత‌` త‌రువాత ఈ ఇరువురి క‌ల‌యిక‌లో వ‌స్తున్న స‌ద‌రు కొత్త చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్, య‌న్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించ‌నున్నాయి. మే నెల‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2021 ఏప్రిల్ లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Team TFNవాట్సాప్
రివ్యూ

భీష్మ మూవీ రివ్యూ : కొండంత వినోదం గోరంత సందేశంతో అలరించిన భీష్మ

మొత్తం మీద సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠ పురం లో వంటి రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ తరువాత కొంచెం డల్ అయిన టాలీవుడ్ కు భీష్మ తో మరొక చక్కని సక్సెస్ దక్కినట్లే...

Team TFNవాట్సాప్
Musical Hit Priyamaina Neeku Completes 19 Years,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Priyamaina Neeku,Priyamaina Neeku Movie,Priyamaina Neeku Telugu Movie,Priyamaina Neeku Movie Updates,Priyamaina N
సినిమా వార్తలు

మ్యూజిక‌ల్ హిట్ `ప్రియ‌మైన నీకు...`కి 19 ఏళ్ళు

ప్రేమక‌థా చిత్రాల‌కు చిరునామాగా నిలచిన క‌థానాయ‌కుల్లో త‌రుణ్ ఒక‌రు. త‌రుణ్ న‌టించిన ప‌లు రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్స్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించాయి. వాటిలో `ప్రియ‌మైన నీకు...` ఒక‌టి. త‌రుణ్, స్నేహ నాయ‌కానాయిక‌లుగా న‌టించిన ఈ సినిమాలో ప్రీతా విజ‌య్‌కుమార్‌, శివాజి, త‌నికెళ్ళ భ‌ర‌ణి, చంద్ర‌మోహ‌న్‌, అలీ, వేణు మాధ‌వ్, వ‌ర్ష‌ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య భూమిక‌లు పోషించారు. సూప‌ర్ గుడ్ ఫిల్మ్స్ ప‌తాకంపై ఆర్.బి.చౌద‌రి నిర్మించిన ఈ యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను బాల‌శేఖ‌ర‌న్ తెర‌కెక్కించారు.

Team TFNవాట్సాప్
Ram Pothineni RED Movie Wraps Up Movie Shooting In Italy,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,RED,RED Movie,RED Telugu Movie,RED Movie Updates,RED Telugu Movie Latest News,RED Movie Shooting Updates
సాంగ్

ఇట‌లీలో పాట‌ల చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న `రెడ్`

`ఇస్మార్ట్ శంక‌ర్` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌రువాత ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా రూపొందుతున్న చిత్రం `రెడ్`. త‌మిళ సినిమా `త‌డ‌మ్` ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. `నేను శైల‌జ‌`, `ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ` అనంత‌రం రామ్, కిషోర్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న ఈ చిత్రాన్ని... ఆ రెండు సినిమాల‌ను నిర్మించిన స్ర‌వంతి మూవీస్ నే నిర్మిస్తోంది. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ బాణీల‌ను అందిస్తున్న ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ లో మాళ‌వికా శ‌ర్మ‌, నివేదా పెతురాజ్, అమృతా అయ్య‌ర్ నాయిక‌లుగా న‌టిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

`నాగేశ్వ‌ర రావు`లో నాగ‌చైత‌న్య క్యారెక్ట‌ర్ డిటైల్స్

గ‌త ఏడాది `మ‌జిలీ`, `వెంకి మామ‌` చిత్రాల్లో విభిన్న పాత్ర‌ల్లో అల‌రించాడు యువ క‌థానాయ‌కుడు అక్కినేని నాగ‌చైత‌న్య‌. ప్ర‌స్తుతం ఈ యంగ్ హీరో `ల‌వ్ స్టోరి` చేస్తున్నాడు. శేఖ‌ర్ క‌మ్ముల రూపొందిస్తున్న ఈ యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్ లో ప‌క్కింటి అబ్బాయి త‌ర‌హా పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు చైతూ. వేస‌విలో ఈ సినిమా రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

క్రిస్మ‌స్ సీజ‌న్ లో నితిన్ - మేర్ల‌పాక గాంధీ చిత్రం?

హిందీలో ఘ‌న‌విజ‌యం సాధించిన `అంధాదూన్` చిత్రం... తెలుగులో రీమేక్ కానున్న సంగ‌తి తెలిసిందే. యువ క‌థానాయ‌కుడు నితిన్ హీరోగా న‌టించ‌నున్న ఈ సినిమాని `వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్`, `ఎక్స్ ప్రెస్ రాజా` చిత్రాల ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక గాంధీ తెర‌కెక్కించ‌నున్నాడు. త్వ‌ర‌లోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. అంతేకాదు... రిలీజ్ డేట్ ని కూడా లాక్ చేశార‌ట‌. వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం... క్రిస్మ‌స్ కానుక‌గా సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు యూనిట్ స‌న్నాహాలు చేస్తోంద‌ట‌. త్వ‌ర‌లోనే ఈ రీమేక్ కి సంబంధించి పూర్తి వివ‌రాలు అధికారికంగా వెల్ల‌డి కానున్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మ‌రోసారి... య‌న్టీఆర్, పూజా హెగ్డే జోడి?

`అర‌వింద స‌మేత‌` త‌రువాత యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్, సెల్యులాయిడ్ తాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేషన్ లో మ‌రో సినిమా రాబోతున్న విష‌యం విదిత‌మే. హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్, య‌న్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ మే నెల‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. అలాగే వ‌చ్చే ఏడాది ఏప్రిల్ లో వేస‌వి కానుక‌గా థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది.

Team TFNవాట్సాప్
Bheeshma Movie Public Opinion
సినిమా వార్తలు

భీష్మ మూవీ పబ్లిక్ ఒపీనియన్

''అ ఆ'' లాంటి సూపర్ హిట్ సినిమా తరువాత ‘లై’, ‘ఛల్ మోహన్ రంగ’, ‘శ్రీనివాస కళ్యాణం’తో వరుసగా హ్యాట్రిక్ ప్లాప్స్ అందుకున్నాడు నితిన్. దీంతో చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని ‘ఛలో’ తో సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుములతో కలిసి 'భీష్మ' సినిమాతో వస్తున్నాడు. ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో నితిన్ పక్కన హీరోయిన్ గా రష్మిక మందన నటిస్తోంది. సింగిల్ ఫరెవర్ అనే ట్యాగ్ లైన్ తో అందరిలో క్యూరియాసిటీ ను పెంచిన టీజర్, ట్రైలర్ లతో సినిమాపై అంచనాలను పెంచేశారు. మరి భారీ అంచనాల మధ్య ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంత వరకూ ఆ అంచనాలను రీచ్ అయింది.

TFN Adminవాట్సాప్
Valayam Movie Public Opinion
సినిమా వార్తలు

వలయం మూవీ పబ్లిక్ ఒపీనియన్

రమేష్ కుడుముల దర్శకుడిగా పరిచయం అవుతూ.. లక్ష్ హీరోగా దిగంగన సూర్యవంశీ హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా 'వలయం'. ఈ సస్పెన్స్ మెయిన్ ఎలిమెంట్ గా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ట్రయిలర్ తోనే అంచనాలను పెంచేసింది. బిచ్చగాడు సినిమాతో నిర్మాతగా మారిన లక్ష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా మూడు సినిమాలు చేసి, హీరోగా నాలుగు సినిమాలు చేశాడు. అయితే మధ్యలో బ్రేక్ రాగా ఇప్పుడు 'వలయం' తో తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి వస్తున్నాడు. ఇక యూత్ కోరుకునే అన్ని ఎలిమెంట్స్‌తో పుల్ ప్యాక్ట్ గా వచ్చిన ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది.

TFN Adminవాట్సాప్
Pressure Cooker Movie Public Opinion
సినిమా వార్తలు

ప్రెషర్ కుక్కర్ మూవీ పబ్లిక్ ఒపీనియన్

అమెరికా వెళ్ళమని తమ పిల్లలను కొంతమంది తల్లితండ్రులు ఎలా టార్చర్ పెడతారో.. అదే కాన్సెప్ట్ ను తీసుకొని తీసిన సినిమా 'ప్రెషర్ కుక్కర్'. సాయిరోనక్, ప్రీతి అస్రాని జంటగా సుజోయ్, సుశీల్‌ దర్శకత్వంలో సుశీల్‌ సుభాష్, అప్పిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

TFN Adminవాట్సాప్
D40 Telugu Title Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Jagame Tantram,Jagame Tantram Movie,Jagame Tantram Telugu Movie,Jagame Tantram Movie Updates,Jagame Tantram Telugu Movie Latest News,Jaga
సినిమా వార్తలు

#D40 తెలుగు టైటిల్ రిలీజ్

కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో ధనుష్ ప్రధాన పాత్రలో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయగా.. తాజాగా ఈ సినిమా తెలుగు టైటిల్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. తెలుగులో ఈ సినిమాకు 'జగమే తంత్రం' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'భీష్మ' మేకింగ్ వీడియో

ఇంకా ఒక్కరోజులో నితిన్ నటించిన భీష్మ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ బిజీ గా వున్న చిత్రయూనిట్ రోజుకో అప్ డేట్ ఇస్తూనే వుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే టీజర్, ట్రయిలర్, పాటలను రిలీజ్ చేశారు. నిన్న 'వాటే బ్యూటీ' వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్

షేర్