`అరవింద సమేత` తరువాత యంగ్ టైగర్ యన్టీఆర్, సెల్యులాయిడ్ తాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న విషయం విదితమే. హారికా అండ్ హాసిని క్రియేషన్స్, యన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ మే నెలలో సెట్స్ పైకి వెళ్ళనుంది. అలాగే వచ్చే ఏడాది ఏప్రిల్ లో వేసవి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ చిత్రంలో కథానాయికగా నటించే అవకాశం పూజా హెగ్డేని వరించిందని సమాచారం. అదే గనుక నిజమైతే… `అరవింద సమేత` తరువాత తారక్ తో – `అరవింద సమేత`, `అల వైకుంఠపురములో` అనంతరం త్రివిక్రమ్ కాంబినేషన్ లో పూజ నటించే ఇదే సినిమా అవుతుంది. త్వరలోనే పూజ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
[custom_ad]
ప్రస్తుతం పూజ ఖాతాలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్`, `ప్రభాస్ 20` చిత్రాలు ఉన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: