`ఎఫ్ 2`, `వెంకి మామ`… ఇలా వరుస విజయాలతో ముందుకు సాగుతున్నారు సీనియర్ హీరో వెంకటేష్. ప్రస్తుతం ఈ దగ్గుబాటి స్టార్ తమిళ బ్లాక్ బస్టర్ `అసురన్` ఆధారంగా రూపొందుతున్న `నారప్ప`లో నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో వెంకీకి జోడీగా ప్రియమణి, అమలా పాల్ నటిస్తుండగా.. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఇదిలా ఉంటే… జనవరి 22న `నారప్ప` రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాగా, ఇప్పటివరకు సగానికి పైగా చిత్రీకరణ పూర్తయిందని సమాచారం. అంతేకాదు, మార్చి నెలాఖరు కల్లా మొత్తం చిత్రీకరణ పూర్తవుతుందని, ఆపై చకచకా నిర్మాణానంతర కార్యక్రమాలు జరిపి మే నెలలో విడుదల చేస్తారని ఇన్ సైడ్ ఇన్ ఫర్మేషన్.
`నారప్ప`ని కలైపులి ఎస్. థాను, డి.సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తుండగా… మెలోడీ బ్రహ్మ మణిశర్మ బాణీలు అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: