తీసుకున్న కథాంశం ఏదైనప్పటికీ చెప్పే విధానం ఎంగేజింగ్ గా ఉంటే ఆదరించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం ఉండదని ప్రేక్షకులు ఎప్పటికప్పుడు చెప్పకనే చెబుతుంటారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన భీష్మ చిత్రం విషయంలో కూడా ప్రేక్షకులు అలాంటి తీర్పే ఇచ్చారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నితిన్, రష్మిక మందన హీరోహీరోయిన్లుగా వెంకీ కుడుముల దర్శకత్వంలో యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన భీష్మ చక్కని వినోద, సందేశాల మేళవింపుగా సాగింది. మంచి అంచనాలతో విడుదలైన భీష్మ ఆ అంచనాలను అందుకుని ఈ సంవత్సరపు మరో డీసెంట్ హిట్ గా నిలుస్తుందట లో ఎలాంటి సందేహం లేదు. ఇంతకూ వినోదం ప్రధానాంశంగా, సందేశం అంతర్లీనంగా సాగిన భీష్మ ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కథాంశం:
హీరో భీష్మ ప్రసాద్( నితిన్) డిగ్రీ కంప్లీట్ చేయలేక బ్యాక్ లాగ్స్ తో కుస్తీ పడుతుంటాడు. తనకు గర్ల్ ఫ్రెండ్ ఎవరూ సెట్ అవటం లేదని బాధపడే తరుణంలో డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఇరుక్కొని పోలీస్ స్టేషన్ పాలవుతాడు. అక్కడ స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ అయిన దేవా( సంపత్ రాజ్) అతనికి నెల రోజుల పాటు పోలీస్ స్టేషన్లో చిన్న చిన్న పనులు చేసే అవుట్ ఆఫ్ సెల్ పనిష్మెంట్ ఇస్తాడు. ఆ సందర్భంలోనే అతనికి అనుకోకుండా చైత్ర( రష్మిక మందన) తో పరిచయం ఏర్పడుతుంది. ఆమె తనను పనిష్ చేసిన పోలీస్ ఆఫీసర్ దేవా కూతురు అని తెలిసేలోపే ఆమెతో ప్రేమలో పడతాడు… ఆమెను ఆకర్షిస్తాడు.
ఆమె భీష్మ ఆర్గానిక్స్ అనే సేంద్రియ ఎరువుల కంపెనీలో పనిచేస్తుంది. ఆ కంపెనీ అధినేత పేరుకూడా భీష్మ.
కొన్ని అనుకోని సంఘటనల నేపథ్యంలో భీష్మ ఆర్గానిక్ కంపెనీకి డిగ్రీ తప్పిన భీష్మ ను సీఈవో గా ప్రకటిస్తాడు ఆ పెద్దాయన. ఈ పరిణామం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇంతకు అంత పెద్ద కంపెనీకి డిగ్రీ కూడా పూర్తి చేయలేని భీష్మ ను ఎందుకు, ఎలా సీఈఓగా ప్రకటించాడు? ఆ తరువాత ఏం జరిగింది ? ప్రత్యర్థి కంపెనీ అరాచకాల నుండి భీష్మ తమ కంపెనీని ఎలా కాపాడాడు? ఒక జులాయిగా తను పనిష్ చేసిన భీష్మ ను కమిషనర్ స్థాయి పోలీస్ ఆఫీసర్ అల్లుడుగా ఎలా అంగీకరించాడు? అబద్ధాలతో తనను బుట్టలో వేసుకున్న భీష్మ ప్రేమను చైత్ర ఎలా అంగీకరించింది? ఇత్యాది సందేహాలకు సమాధానంగా నిలుస్తుంది మిగిలిన కథ.
దర్శకుడి హ్యాండ్లింగ్ ఎలా ఉంది? :
నిజానికి అల్లరి చిల్లరిగా తిరిగే ఒక కుర్రాడు అమ్మాయిని బుట్టలో వేసుకునే పాయింట్ తో గతంలో చాలా చిత్రాలు వచ్చాయి. అయితే ఆ ప్రాసెస్ ఆఫ్ చీటింగ్ ఎంత కన్విన్సింగ్ గా ఉంది? ఎంత ఎంటర్టైనింగ్ గా ఉంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే దర్శకుడు వెంకీ కుడుముల మంచి హిలేరియస్ ప్రజెంటేషన్ ఇచ్చాడు అని అభినందించవచ్చు. అలాగే తీసుకున్న ఒక వినోదాత్మక కథాంశాన్ని సేంద్రీయ వ్యవసాయం అనే ఒక చక్కని వ్యవసాయ విధానంతో మిళితం చేసి వినోదానికి వినోదం… సందేశానికి సందేశం అన్న ఉభయతారక ప్రయోజనాన్ని సాధించాడు దర్శకుడు వెంకీ కుడుముల. నిజానికి రైతులలో సేంద్రియ వ్యవసాయం పట్ల అవగాహనను పెంచటం కోసం ప్రభుత్వం గాని, సంస్థలు గానీ ఎంతో కృషి చేస్తున్నాయి. అలాంటి ఒక సీరియస్ పాయింట్ కు చక్కని వినోదాన్ని మేళవించి ఒక షీర్ ఎంటర్ టైనర్ తీయవచ్చు అని నిరూపించిన వెంకీ కుడుములను మనస్ఫూర్తిగా అభినందించాలి. అలాగే అతని మీద నమ్మకంతో ఈ పాయింట్ ను అంగీకరించి ప్రొసీడ్ అయిన హీరో నితిన్ ను, యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశీకి కూడ ఆ అభినందనల్లో సముచిత వాటా దక్కుతుంది. అలాగే ఈ సినిమా డైలాగ్ రైటర్ కూడా అయిన వెంకీ కుడుముల హాస్య సన్నివేశాల్లో ఎంత చమత్కారాన్ని ప్రదర్శించాడో సేంద్రియ వ్యవసాయ విధానాలపై జరిగే టీవీ చర్చా కార్యక్రమంలో అంతటి విషయ పరిజ్ఞానాన్ని ప్రదర్శించాడు. మొత్తం మీద తీస్తున్నది కామెడీ సినిమా అయినప్పటికీ ఎక్కడా టేక్ ఇట్ ఈజీగా కాకుండా మంచి కన్విక్షన్ తో కథాకథనాలను నడిపించాడు దర్శకుడు వెంకీ కుడుముల. అందుకే మీరు ఏం చెబుతారో మాకు అనవసరం … సినిమా చూస్తున్నంతసేపు మమ్మల్ని ఎంగేజ్ చేస్తే చాలు అన్న ప్రేక్షకుల రిక్వైర్మెంట్ ను చక్కగా ఫుల్ ఫిల్ చేసిన షీర్ ఎంటర్టైనర్ భీష్మ అని చెప్పవచ్చు.
ద్వితీయార్థంలో అక్కడక్కడ చిన్న లాగ్స్ ఉన్నప్పటికీ మొత్తం మీద ప్రేక్షకుల వినోదానికి ఏలాంటి డ్డోకా లేని వినోద, సందేశాల మేళవింపు భీష్మ అని చెప్పవచ్చు.
పర్ఫార్మెన్సెస్:
పర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే ప్రతి ఒక్కరూ అప్ టూ దా మార్క్ అన్నట్లుగా చేశారు. ముఖ్యంగా అఆ.. తర్వాత నితిన్ కు దొరికిన మంచి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ భీష్మ అని చెప్పాలి. కామెడీ, యాక్షన్, డాన్స్, పర్ఫార్మెన్స్ వంటి అన్ని ఎలిమెంట్స్ కు అవకాశం ఉన్న భీష్మ పాత్రలో నితిన్ చాలా చక్కగా , చాలా ఈజ్ తో నటించాడు. అలాగే గీత గోవిందం తర్వాత రష్మిక మందనకు దొరికిన మరొక డీసెంట్ అండ్ గ్లామరస్ రోల్ ఇందులోని చైత్ర పాత్ర. ఇక భీష్మ ఆర్గానిక్స్ అధిపతిగా ఒకప్పటి కన్నడ విలక్షణ నటుడు అనంత నాగ్ ను, మెయిన్ విలన్ రాఘవన్ పాత్రకు జిష్ సేన్ గుప్తాను , పోలీస్ ఆఫీసర్ గా సంపత్ రాజ్ లను ఎంపిక చేసుకోవటాన్ని బెస్ట్ కాస్టింగ్ సెలక్షన్ గా అభినందించాలి. మిగిలిన పాత్రల్లో వెన్నెల కిషోర్, సీనియర్ నరేష్, రఘు బాబు, బ్రహ్మాజీ, అజయ్, శుభలేఖ సుధాకర్ తదితరులు వెల్డన్ అనిపించారు.
టెక్నికల్ గా చూస్తే మహతి స్వర సాగర్ సంగీతంలో రెండు పాటలు , బ్యాగ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ చాలా ప్లజంట్ గా ఉంది. అలాగే నవీన్ నూలి ఎడిటింగ్ , సితార ఎంటర్టైన్మెంట్స్ మేకింగ్ స్టాండర్డ్స్ సింప్లీ గుడ్.
మొత్తం మీద సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠ పురం లో వంటి రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ తరువాత కొంచెం డల్ అయిన టాలీవుడ్ కు భీష్మ తో మరొక చక్కని సక్సెస్ దక్కినట్లే…
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: