`రెడ్`కి మ‌ణిశ‌ర్మ సెంటిమెంట్

RED Movie Team Banks On Mani Sharma Sentiment

`ఇస్మార్ట్ శంకర్`తో `ఇస్మార్ట్`గా బౌన్స్ బ్యాక్ అయ్యాడు మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ‌. ప్ర‌స్తుతం `మెగాస్టార్ 152`తో పాటు `నార‌ప్ప‌`, `రెడ్`… ఇలా ప‌లు క్రేజీ ప్రాజెక్ట్ ల‌కు బాణీలు అందిస్తున్నాడీ వెట‌ర‌న్ కంపోజ‌ర్. కాగా, వీటిలో `రెడ్` ముందుగా రిలీజ్ కానుంది. దాదాపు చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్.. ఏప్రిల్ 9న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే.. ఏప్రిల్ 9కి, మ‌ణిశ‌ర్మ‌కి మంచి అనుబంధ‌మే ఉంది. సంగీత ద‌ర్శ‌కుడిగా మ‌ణిశ‌ర్మ కెరీర్ ని కీల‌క మ‌లుపు తిప్పిన `బావ‌గారూ.. బాగున్నారా!`(1998) 22 ఏళ్ళ క్రితం ఇదే తేదిన రిలీజై సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.. మ‌రి… మ‌రోసారి అదే తేదికి వ‌స్తున్న `రెడ్` కూడా మ‌ణి కెరీర్ లో మ‌రో మెమ‌ర‌బుల్ ఫిల్మ్ అవుతుందేమో చూడాలి.

[custom_ad]

రామ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న `రెడ్`కి కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. మాళ‌వికా శ‌ర్మ‌, నివేదా పెతురాజ్, అమృతా అయ్య‌ర్ నాయిక‌లుగా న‌టిస్తున్నారు. త‌మిళ చిత్రం `త‌డమ్` ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − four =