ఒరేయ్ బుజ్జిగా ‘కురిసెన.. కురిసెన’ పాట రిలీజ్

2020 New Movies, Anup Rubens, Armaan Malik, Armaan Malik New Song, Hebah Patel, Kurisena, Kurisena Lyrical Song From Orey Bujjiga Movie Out Now, Kurisena song, Kurisena Song Lyrical, Latest Telugu Movies 2020, latest telugu movies news, Malvika Nair, Mango Music, Orey Bujjiga, Orey Bujjiga Movie, Orey Bujjiga Movie Teaser, Orey Bujjiga Movie Trailer, Orey Bujjiga Teaser, Orey Bujjiga Telugu Movie, Orey Bujjiga Trailer, P Meghana, Raj Tarun, Raj Tarun New Movie, Raj Tarun Orey Bujjiga, Raj Tarun Orey Bujjiga Teaser, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates, Vijay Kumar Konda

విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా ‘ఒరేయ్‌.. బుజ్జిగా’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 25 వ తేదీ రిలీజ్ కానున్న నేపథ్యంలో… ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టారు. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయగా.. ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి మొదటి పాటను రిలీజ్ చేశారు. ‘కురిసెన.. కురిసెన.. తొలకరి వలపులె మనసున, మురిసెన.. మురిసెన.. కలలకి కనులకి కలిసెన..’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్‌ను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ విడుదల చేశారు. ఈ పాటకు కె.కె. సాహిత్యం అందించగా అర్మాన్ మాలిక్, పి. మేఘన ఆలపించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ ‘‘వరుణ్‌తేజ్‌ మా సినిమా మొదటి పాటను విడుదల చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఆయనకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను… ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది…మా బ్యానర్ లో ‘ఒరేయ్‌ బుజ్జిగా..’ తప్పకుండా మరో సూపర్‌హిట్‌ మూవీ అవుతుంది’’ అని అన్నారు.

[custom_ad]

కాగా యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌, మాళవిక నాయర్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బా పటేల్ కూడా కీలక పాత్రలో నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.