
ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 171


నితిన్ హిందీ రీమేక్ లాంచ్

గేమ్ స్టార్ట్ చేసిన మెగా ప్రిన్స్

"తలైవి" కంగనా రనౌత్ న్యూ లుక్

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు పై తమన్నా ప్రశంసలు
యన్టీఆర్ ‘రాజమకుటం’కు 60 ఏళ్ళు

నితిన్, నిత్యామీనన్ ల ‘ఇష్క్’కి 8 ఏళ్ళు
అదితి రావు హైదరి మనసులో మాట

పోలవరం పరిసర ప్రాంతాల్లో `మెగాస్టార్ 152`?

`కిలాడి`గా రవితేజ?

సుక్కు చిత్రంలో బన్నీ డ్యూయెల్ రోల్?

'పలాస 1978' రిలీజ్ డేట్ ఫిక్స్

ఫైనల్లీ కె.జి.ఎఫ్ 2 వర్క్ స్టార్ట్..!

బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలతో..!
"గతం "మూవీ టీజర్ రిలీజ్
హైదరాబాద్ సేఫ్ సిటీ..!
ఎవరేమన్నా అతడినే పెళ్లి చేసుకుంటా..!

ఒకే రోజు వివాహం
టాలీవుడ్ హీరోలు నితిన్, నిఖిల్ ల వివాహాలు ఏప్రిల్ 16 వ తేదీ జరుగనున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన నిఖిల్ "అర్జున్ సురవరం", నితిన్ "భీష్మ " మూవీస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. హీరో నిఖిల్ హైదరాబాదీ మ్యారేజ్ చేసుకుంటుండగా, నితిన్ తన మ్యారేజ్ ను దుబాయ్ లో ప్లాన్ చేశారు. ఇద్దరిదీ ప్రేమ వివాహం కావడం విశేషం.

నితిన్ హిందీ రీమేక్ లాంచ్
ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో బాలీవుడ్ లో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ 'అంధాదున్' భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ సినిమాలో అంధుడిగా చేసిన ఆయుష్మాన్ తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్నాడు. ఇక ఈ సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

గేమ్ స్టార్ట్ చేసిన మెగా ప్రిన్స్
వరుణ్ నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా నటించనున్నాడు. దీనిలో భాగంగానే వరుణ్ ఈ సినిమా కోసం ఒలింపిక్ విన్నర్ టోని జెఫ్రీస్ పర్యవేక్షణలో ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇదిలా ఉండగా ఇక ఇన్ని రోజులు ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకున్న చిత్రయూనిట్ ఈ రోజు నుండి షూటింగ్ ను మొదలుపెట్టారు. వైజాగ్లో ఈ సినిమా షూటింగ్ తెలుస్తుంది. అంతేకాదు రిలీజ్ డేట్ ను కు ఫిక్స్ చేశారు. జులై 30, 2020 న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేసారు.

"తలైవి" కంగనా రనౌత్ న్యూ లుక్
లెజెండరీ యాక్ట్రెస్, పొలిటికల్ లీడర్ జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో "తలైవి" మూవీ తమిళ, తెలుగు, హిందీ భాషలలో రూపొందుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ "క్వీన్ " కంగనా రనౌత్ జయలలిత పాత్రలో నటిస్తుండగా, MGR పాత్రలో అరవింద్ స్వామి నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, జిషు సేన్ గుప్తా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు పై తమన్నా ప్రశంసలు
టాలీవుడ్, కోలీవుడ్ , బాలీవుడ్ లలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణిస్తున్న తమన్నా రీసెంట్ గా రిలీజ్ అయిన "సైరా నరసింహా రెడ్డి " మూవీ లో అద్భుతంగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. స్పెషల్ సాంగ్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసే తమన్నా సూపర్ స్టార్ మహేష్ బాబు తో "సరిలేరు నీకెవ్వరు " మూవీ లో డ్యాంగ్ డ్యాంగ్ సాంగ్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
యన్టీఆర్ ‘రాజమకుటం’కు 60 ఏళ్ళు
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు యన్.టి.రామారావు, దిగ్గజ దర్శకనిర్మాత బి.యన్.రెడ్డిది అపూర్వ జోడి. వీరిద్దరి కలయికలో రూపొందిన తొలి, మలి చిత్రాలు ‘మల్లీశ్వరి’, ‘భాగ్యరేఖ’ మంచి విజయం సాధించగా... ముచ్చటగా మూడో సినిమాగా తెరకెక్కిన ‘రాజమకుటం’ కూడా అదే బాటలో నడవడం విశేషం. ఇందులో యన్టీఆర్ సరసన రాజసులోచన కథానాయికగా నటించగా... గుమ్మడి, రాజనాల, పద్మనాభం, కస్తూరి శివరావు, వంగర, కన్నాంబ తదితరులు ఇతర ముఖ్య భూమికలు పోషించారు.

నితిన్, నిత్యామీనన్ ల ‘ఇష్క్’కి 8 ఏళ్ళు
యువ కథానాయకుడు నితిన్... పలు రొమాంటిక్ ఎంటర్‌టైనర్స్ లో సందడి చేశాడు. వాటిలో ‘ఇష్క్’ ఒకటి. నితిన్ కమ్ బ్యాక్ ఫిల్మ్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో నిత్యా మీనన్ హీరోయిన్‌గా నటించింది. అజయ్, నాగినీడు, అలీ, శ్రీనివాస్ రెడ్డి, సుప్రీత్, రవిప్రకాష్, మధునందన్, సింధు తులాని, రోహిణి, సుధ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ నిర్మించిన ‘ఇష్క్’కి టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కె కుమర్ దర్శకత్వం వహించారు.
అదితి రావు హైదరి మనసులో మాట
బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణిస్తున్న అదితి రావు హైదరి సక్సెస్ ఫుల్ మూవీ "సమ్మోహనం" తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. తమిళ, హిందీ మూవీస్ లో బిజీగా ఉన్న అదితి రావు ప్రస్తుతం సస్పెన్స్ థ్రిల్లర్ "V" మూవీ లో నటిస్తున్నారు. అదితి రావు హీరోయిన్ గా ఒక హిందీ, 2 తమిళ, ఒక మలయాళ మూవీస్ షూటింగ్ జరుపుకుంటున్నాయి.

పోలవరం పరిసర ప్రాంతాల్లో `మెగాస్టార్ 152`?
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. `ఆచార్య` అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ సినిమాలో చిరు రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. ఒక పాత్రలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉద్యోగిగానూ, మరో పాత్ర కోసం నక్సలైట్ గానూ దర్శనమిస్తారని ప్రచారం సాగుతోంది.

`కిలాడి`గా రవితేజ?
ఇటీవలే `డిస్కో రాజా`గా సందడి చేశాడు మాస్ మహారాజా రవితేజ. ప్రస్తుతం కాప్ స్టోరీ `క్రాక్`తో బిజీగా ఉన్న ఈ టాలెంటెడ్ స్టార్... మే 8న సదరు సినిమాతో పలకరించబోతున్నాడు. కాగా, ఆ లోపే మరో యాక్షన్ థ్రిల్లర్ ని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నాడు రవితేజ. `రాక్షసుడు` ఫేమ్ రమేష్ వర్మ రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో రవితేజ రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడని సమాచారం. మార్చి నుండి సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ సినిమాకి `కిలాడి` అనే టైటిల్ పరిశీలిస్తున్నారని తెలిసింది. త్వరలోనే ఈ టైటిల్ పై మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది.

సుక్కు చిత్రంలో బన్నీ డ్యూయెల్ రోల్?
దాదాపు అగ్ర కథానాయకులందరూ డ్యూయెల్ రోల్స్ లో సందడి చేసిన వారే. అయితే, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం ఇప్పటివరకు ద్విపాత్రాభినయం చేయనేలేదు. త్వరలో ఆ ముచ్చట తీరనుందని సమాచారం.

'పలాస 1978' రిలీజ్ డేట్ ఫిక్స్
1978 ప్రాంతంలో పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘‘పలాస 1978’’. తమ్మారెడ్డి భరధ్వాజ సమర్పణలో సుధా మీడియా పతాకంపై ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రంలో రక్షిత్, నక్షత్ర జంటగా నటింస్తున్న ఈ సినిమా ద్వారా. కరుణ కుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇక ఇటీవలే ఈ సినిమా టీజర్ ను రెలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు అందరిలో మరింతగా ఆసక్తి పెరిగిపోయింది.

ఫైనల్లీ కె.జి.ఎఫ్ 2 వర్క్ స్టార్ట్..!
ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వచ్చిన కె.జి.ఎఫ్ చాప్టర్ 1 ఎంత పెద్ద సెన్సేషనల్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కన్నడలోనే కాదు.. తెలుగు, తమిళ, హింది భాషల్లో ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దాదాపు 250 కోట్లు వసూలు చేసి రికార్డులు సృష్టించగా, కన్నడలో 100 కోట్లు వసూలు చేసింది. నిజానికి కన్నడం 100కోట్లు కలెక్ట్ చేయడం అంటే మాములు విషయం కాదు.

బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలతో..!
మొదటి సినిమా 'చిత్రం' తోనే సంచలన విజయం సాధించిన తేజ ఆ తర్వాత వరుసగా 'నువ్వు నేను', 'జయం' ఇలా సూపర్ హిట్లు కొట్టాడు. ఇక ఫుల్ ఫామ్ లో వున్న తేజ ఆ తరవాత తీసిన సినిమాల వల్ల కాస్త వెనుకపడ్డాడు. అయితే చాలా కాలం తర్వాత రానాతో 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా హిట్ తో కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన 'సీత' బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిందనుకోండి. ఈ మూవీ తరువాత మళ్ళీ కాజల్ తో మరో చిత్రం చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. ఐతే ఆయన ఇంత వరకు ఎటువంటి చిత్రం ప్రకటించలేదు. ఇక ఇటీవల గోపీచంద్ తో కూడా సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా.. ఈ రోజు తేజ పుట్టిన రోజు సందర్భంగా రెండు టైటిల్స్ రిజిస్టర్…

'ఓ పిట్టకథ' - 'ఏదో.. ఏదో' సాంగ్ ప్రోమో రిలీజ్
విశ్వంత్, సంజయ్ రావు, నిత్యా శెట్టి, బ్రహ్మాజీ ప్రధాన పాత్రధారులుగా.. చెందు ముద్దు దర్శకుడిగా పరిచయం అవుతూ వస్తున్న సినిమా 'ఓ పిట్టకథ'. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ఇప్పటీకే పలువురు సినీ ప్రముఖులతో ప్రీ-టీజర్, టీజర్, మొదటి పాటను రిలీజ్ చేయగా...ఇప్పుడు మరో అప్డేట్ తో ముందుకొచ్చారు చిత్ర యూనిట్. ఈ సినిమా నుండి 'ఏదో.. ఏదో' పాట ప్రోమోను రిలీజ్ చేయనున్నారు. ఈ ప్రోమో తన కన్నుగీటుతో సంచలనం సృష్టించిన ప్రియా వారియర్ చేతుల మీదుగా రిలీజ్ చేయనున్నారు.

స్పెషల్ డే రోజు 'టక్ జగదీష్' ఫస్ట్ లుక్ రిలీజ్..!
శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా "టక్ జగదీష్" . రీతువర్మ, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను... సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఇటీవలే లాంఛనంగా ప్రారంభించారు. ప్రస్తుతం అవుట్ డోర్ లో ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.
"అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి" టైటిల్ సాంగ్ రిలీజ్
బ్లాక్ &వైట్ పిక్చర్స్, పూర్వి పిక్చర్స్ బ్యానర్స్ పై బాలు అడుసుమిల్లి దర్శకత్వంలో ధన్య బాలకృష్ణ, కోమలి ప్రసాద్, సిద్ధి ఇద్నానీ , త్రిధా చౌదరి ప్రధాన పాత్రలలో "అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి" మూవీ రూపొందింది. రఘుబాబు, హిమజ ముఖ్య పాత్రలలో నటించారు. వికాస్ బడిజ సంగీతం అందించారు.
"గతం "మూవీ టీజర్ రిలీజ్
ఆఫ్ బీట్ ఫిల్మ్స్ , ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్ పై కిరణ్ రెడ్డి దర్శకత్వంలో భార్గవ, రాకేష్, పూజిత ప్రధాన పాత్రలలో సైకలాజికల్ థ్రిల్లర్ "గతం "మూవీ మెమరీ కెన్ కిల్ ట్యాగ్ లైన్ తో రూపొందుతుంది. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. భార్గవ P, హర్ష వర్ధన్ ప్రతాప్, సృజన్ Y నిర్మాతలు.
హైదరాబాద్ సేఫ్ సిటీ..!
మహిళలకు హైదరాబాద్ సేఫ్ సిటీ అంటుంది ఫిదా పిల్ల సాయి పల్లవి. అసలు సంగతేంటంటే.. హైదరాబాద్‌లోని హెచ్‌ఐఐసీలో సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో మహిళా సాధికారత సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సాయి పల్లవి.. మహిళా ఉద్యోగుల భద్రత కోసం రూపొందించిన ‘షీ సేఫ్’ అనే ప్రత్యేక యాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళల భద్రత కోసం తెలంగాణ పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారని, పోలీసుల భద్రతతో మహిళలు నిశ్చింతగా ఉంటున్నారన్నారని.. మహిళకు హైదరాబాద్ సేఫ్ సిటీ అని ఆమె తెలిపింది.
ఎవరేమన్నా అతడినే పెళ్లి చేసుకుంటా..!
అనుష్క పెళ్లి మ్యాటర్ ఎప్పుడూ టాక్ ఆఫ్ ద టౌనే. ఎవరో ఒకరితో అనుష్క పెళ్లి అంటూ వార్తలు వస్తూనే ఉంటాయి. ముందు మన బాహుబలి ప్రభాస్ తో అన్నారు. ఈ వార్తలు ఒక మూడు నాలుగేళ్లే వచ్చాయి. తమ మధ్య ఫ్రెండ్‌షిప్పే కానీ ప్రేమ లేదని చాలా సార్లు ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు. అయినా కూడా రూమర్లకు బ్రేక్ పడలేదు. గత ఏడాది అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారు అని కూడా అన్నారు. ఇక ఆ తర్వాత ఎవరో బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకోబోతుంది అని అన్నారు. ఇక రీసెంట్ గా ఓ క్రికెటర్‌తో ప్రేమలో పడిందనే ప్రచారం జరుగుతోంది. ఆ క్రికెటర్ తోనే అనుష్క పెళ్లి అని బాగానే వార్తలు వచ్చాయి. దీనితో ఇక తనపై వస్తున్న వార్తలపై అనుష్క స్పందించి…